కోలివుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉన్న హీరోల్లో సూర్య కూడా ఒకరు, తెలుగు వారు సూర్య అని, తమిళ్ వాళ్ళు సూరియా అని పిలుచుకునే సూర్య కి తెలుగు లో ఒక టైం లో స్టార్ హీరోల రేంజ్ క్రేజ్ వచ్చినా సరైన హిట్స్ లేక క్రేజ్ ని కోల్పోయాడు సూర్య. రీసెంట్ టైం లో బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన హిట్స్ లేక మార్కెట్….
కూడా తగ్గుతూ వస్తున్నా సూర్య సినిమా ల పై క్రేజ్ మాత్రం తగ్గడం లేదు… తెలుగు లో క్రేజ్ అండ్ మార్కెట్ కొద్దిగా తగ్గినప్పటికీ తమిళ్ లో మాత్రం సూర్య సినిమాలకు బిజినెస్ బాగానే జరుగుతుంది, లేటెస్ట్ గా సూర్య నటించిన కొత్త సినిమా…
ఆకాశం నీ హద్దుగా సాలిడ్ బిజినెస్ తో దుమ్ము లేపింది, కాగా సినిమా బడ్జెట్ ఒకింత అందరికీ షాక్ కి గురి చేసింది అని చెప్పాలి. ఈ సినిమా ను కేవలం 15 కోట్ల రేంజ్ బడ్జెట్ తోనే తెరకెక్కించారు. సూర్య కూడా ఒక నిర్మాత అవ్వడం తో తన రెమ్యునరేషన్ కాకుండా సినిమా చేయగా 15 కోట్ల రేంజ్ బడ్జెట్ లోనే కంప్లీట్ అయిన సినిమా…
ఓవరాల్ గా సాధించిన బిజినెస్ అండ్ ప్రాఫిట్ ని గమనిస్తే… డిజిటల్ రైట్స్ కింద 65 కోట్ల రేటు ని, అన్ని భాషలలో కలిపి సినిమా శాటిలైట్ అండ్ మ్యూజిక్ రైట్స్ కింద 40 కోట్ల రేటు ని సొంతం చేసుకోగా… టోటల్ బిజినెస్ 105 కోట్ల మార్క్ ని అందుకుంది. కాగా ఇందులో బడ్జెట్ ని పక్కకు పెడితే…
సినిమాతో ఏకంగా 90 కోట్ల మేర లాభం నిర్మాతలకు దక్కింది అని చెప్పాలి…. కాగా సూర్య నిర్మాత కాబట్టి సినిమా ద్వారా సాలిడ్ ప్రాఫిట్ ని సొంతం చేసుకోగా… రీసెంట్ గా మాట ఇచ్చిన విధంగా 5 కోట్లను చారిటీలకు సినీ కార్మికుల కోసం ఇచ్చాడు. దాంతో పాటే రీసెంట్ గా తనకి 70 కోట్ల మేర అప్పు ఉందని చెప్పగా అవన్నీ కూడా క్లియర్ అయినట్లే అని అంటున్నారు.