Home గాసిప్స్ సూర్య సినిమా కి హిందీ లో రికార్డ్ లెవల్ బిజినెస్!

సూర్య సినిమా కి హిందీ లో రికార్డ్ లెవల్ బిజినెస్!

0

కోలివుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న హీరోల్లో సూర్య కూడా ఒకరు… శివ పుత్రుడు సినిమా తో మెప్పించి గజినీ తో తెలుగు ఆడియన్స్ మనసు గెలుచుకున్న్ సూర్య కి తెలుగు లో కూడా మంచి స్టార్ డం ఏర్పడగా ఒక స్టేజ్ లో ఇక్కడ హీరోల లెవల్ లో సూర్య కి క్రేజ్ వచ్చింది, కానీ క్రమంగా ఫ్లాఫ్ మూవీస్ వలన తన మార్కెట్ కి….

ఎదురు దెబ్బ పడటం మొదలు అవ్వగా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఓ నికార్సయిన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న సూర్య నటిస్తున్న అప్ కమింగ్ మూవీస్ లో ఇప్పుడు అందరూ ఆశగా ఎదురు చూస్తున్న సినిమా వాడి వాసల్ సినిమా అని చెప్పాలి.

నారప్ప ఒరిజినల్ డైరెక్టర్ వెట్రి మారన్ డైరెక్షన్ లో సూర్య నటించబోతున్న ఈ సినిమా జల్లికట్టు నేపధ్యంలో తెరకెక్కుతున్న సినిమా కాగా హీరోయిజం సీన్స్ సినిమా మొత్తం ఓ రేంజ్ లో ఉండబోతున్నాయని మేకర్స్ ఆల్ రెడీ కన్ఫాం చేశారు. పక్కా మాస్ మూవీ గా వస్తున్న ఈ సినిమా తో….

కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని అందరూ ఆశిస్తుండగా ఈ సినిమా పై ఏర్పడ్డ క్రేజ్ తో ఆల్ రెడీ ఈ సినిమా బిజినెస్ జోరు అందుకుంది. ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ రీసెంట్ గా అమ్ముడు పోగా సూర్య కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ రేటు ని సొంతం చేసుకుంది…

హిందీ డబ్బింగ్ రైట్స్ కింద ఏకంగా 25 కోట్ల రేంజ్ లో రేటు ని ఈ సినిమా సొంతం చేసుకుందని అంటున్నారు. ఇది నిజంగానే అల్టిమేట్ రేటు అని చెప్పాలి. సూర్య రీసెంట్ మూవీ సూరరై పోట్రు డిజిటల్ లో సాధించిన విజయం తో అప్ కమింగ్ సూర్య మూవీస్ పై అంచనాలు పెరిగాయి. ఈ సినిమా పై మరింత ఎక్కువగా అంచనాలు ఉన్నాయని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here