టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుండగా సినిమా పై నెలకొన్న క్రేజ్ దృశ్యా ఫస్ట్ డే భారీ రికార్డులను సినిమా బ్రేక్ చేస్తుందని అంతా భావిస్తున్నారు. కాగా అందరినీ ఊరిస్తున్న మార్కెట్ గా హిందీ మార్కెట్ గురించి చెప్పుకోవాలి, అక్కడ సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుంది అన్నది ఆసక్తిగా మారింది.
కాగా సైరా నరసింహా రెడ్డి కి ప్రస్తుతానికి అయితే అక్కడ నుండి పాజిటివ్ రెస్పాన్స్ ఎక్కువగా ఉందని చెప్పాలి. ముఖ్యంగా అక్కడ ఆడియన్స్ సినిమా ను ఎక్కువగా ఇలాంటి పేట్రియాటిక్ నేపధ్యంలో వచ్చి డిసాస్టర్ గా నిలిచిపోయిన అమీర్ ఖాన్ థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ తో పోల్చుతున్నారు.
అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన ఆ సినిమా లో విజువల్స్ కానీ టేకింగ్ కానీ యాక్షన్ సీన్స్ కానీ చాలా నాసిరకంగా ఉన్నాయని చాలానే కంప్లైంట్స్ వచ్చాయి, వాటికి తోడూ పాత్రల మధ్య ఎమోషన్స్ ఏమాత్రం పండలేదని అదే సినిమా ఫ్లాఫ్ కి ప్రధాన కారణం అని తేల్చేశారు.
అదే సమయం లో సైరా లో విజువల్స్, మ్యూజిక్, గ్రాండియర్ అడుగడుగునా కనిపిస్తుండగా, భారీ యాక్షన్ సీన్స్ అలాగే ఎమోషనల్ సీన్స్ సినిమాలో అద్బుతంగా వచ్చాయని చెబుతుండటం తో ఆ రెండు నార్త్ వారికి నచ్చితే సినిమా రికార్డులు నమోదు చేయడం ఖాయమని భావిస్తున్నారు.
ఓపెనింగ్స్ స్లో గానే మొదలు అవుతుంది కానీ టాక్ తో పాటు ఇవి కూడా ఇంపాక్ట్ చూపితే లాంగ్ రన్ లో సినిమా అద్బుతాలు సృష్టించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నది అక్కడ ట్రేడ్ కూడా చెబుతున్న మాట. మరి సైరా నరసింహా రెడ్డి ఈ విషయంలో అక్కడ సాటిస్ ఫై చేయగలిగితే లాంగ్ రన్ లో సెన్సేషనల్ కలెక్షన్స్ ని సాధించే అవకాశం పుష్కలంగా ఉంటుంది.