Home న్యూస్ సైరా నరసింహా రెడ్డి రివ్యూ-రేటింగ్…ప్లస్ & మైనస్ పాయింట్స్!!

సైరా నరసింహా రెడ్డి రివ్యూ-రేటింగ్…ప్లస్ & మైనస్ పాయింట్స్!!

1

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ సైరా నరసింహా రెడ్డి భారీ అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేయగా సినిమా ముందుగా ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలను పూర్తీ చేసుకుని అక్కడ నుండి మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది, ఇక సినిమా ఇప్పుడు రెగ్యులర్ షోలు కూడా పూర్తీ కాగా అసలు సిసలు రివ్యూ లోకి వెల్లిపోదాం పదండీ.. ముందు గా కథ విషయానికి వస్తే…

బ్రిటిష్ వాళ్ళు ఇండియా లో ఎంటర్ అయ్యి ఒక్కో ప్రాంతాన్ని తమ ఆదీనంలో పెట్టుకుంటున్నారు, అలా రాయలసీమ కి వచ్చిన వాళ్ళ ని ఎదిరించిన మొదటి వీరుడు నరసింహా రెడ్డి. జనాల్లో చైతన్యం తెచ్చి ఎలా బ్రిటిష్ వారి పై పోరాటం చేశాడు, బ్రిటిష్ వారు నరసింహా రెడ్డి ని…

ఆపడానికి ఎలాంటి ఎత్తుగడలు వేశారు, చివరికి ఎవరు గెలిచారు అన్నది ఓవరాల్ గా సినిమా స్టొరీ పాయింట్. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి సినిమా కి హార్ట్ అండ్ సోల్. 30 ఏళ్ల వ్యక్తీ లుక్ లో అంత పెర్ఫెక్ట్ గా సెట్ కాకున్నా తర్వాత స్వాతంత్ర్యం కోసం పోరాడే లుక్ లో మాత్రం అదరగొట్టాడు.

మెగాస్టార్ డైలాగ్స్, పెర్ఫార్మెన్స్ హీరోయిజం అన్నీ అద్బుతంగా హైలెట్ అయ్యాయి. ఇక హీరోయిన్స్ నయనతార మరియు తమన్నా లో తమన్నాకి మంచి రోల్ దక్కింది, ఇద్దరి పెర్ఫార్మెన్స్ కూడా బాగా ఉంది, ఇక సపోర్టింగ్ స్టార్ కాస్ట్ లో అమితాబ్, కిచ్చ సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు అందరు ఆకట్టుకున్నారు.

ఇక సంగీతం విషయానికి వస్తే సైరా టైటిల్ సాంగ్ రెస్పాన్స్ మాములుగా లేదు, ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ విషయం లో కూడా అమిత్ త్రివేది ఫుల్ మార్కులు కొట్టేశాడు, వార్ సీన్స్ లో బ్యాగ్రౌండ్ స్కోర్ ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. ఇక హీరోయిజం ఎలివేట్ సీన్స్ లో కూడా గూస్ బంప్స్ తెప్పించింది.

ఇక స్క్రీన్ ప్లే అండ్ ఎడిటింగ్ అంత షార్ప్ గా లేదు, ముఖ్యంగా ఫస్టాఫ్ టేక్ ఆఫ్ అయ్యే సరికి కొంత సమయం పడుతుంది, ప్రీ ఇంటర్వెల్ నుండి మళ్ళీ సెకెండ్ ఆఫ్ మొదటి 20 నిమిషాలు సినిమా మరో లెవల్ లో ఉంటుంది, మళ్ళీ కొంచం తగ్గి తిరిగి క్లైమాక్స్ అద్బుతంగా ఆకట్టుకుంటుంది.

లెంత్ అండ్ స్క్రీన్ ప్లే ఇంకొంచం టైట్ గా ఉండి ఉంటె సినిమా రేంజ్ అవుట్ ఆఫ్ ది వరల్డ్ రేంజ్ అనిపించి ఉండేది. ఇక సినిమాటోగ్రఫీ అల్టిమేట్ అని చెప్పాలి, రత్నవేలు టేకింగ్ బాహుబలి విజువల్స్ ని మరిపించి మెప్పించింది. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా రామ్ చరణ్ ని ఎంత మెచ్చుకున్నా తక్కువే…

అంత బడ్జెట్ పెట్టి ఏం తీశారు అని అంతా అనుకున్నారు కానీ విజువల్ గ్రాండియర్, గ్రాఫిక్స్, లోకేషన్స్, భారీ స్టార్ కాస్ట్ ఇలా అన్ని అద్బుతంగా ఉండటం వలెనే బడ్జెట్ అంత అయ్యింది అని తెలుస్తుంది, రామ్ చరణ్ పెట్టిన ప్రతీ పైసా స్క్రీన్ పై క్లియర్ గా కనిపిస్తుంది.

ఇక డైరెక్షన్ పరంగా సురేందర్ రెడ్డి ఓ అద్బుతాన్ని డైరెక్ట్ చేశాడు అని చెప్పొచ్చు. అక్కడక్కడా కొన్ని మిస్టేక్స్ జరిగినా కానీ తన టేకింగ్ అల్టిమేట్ అని చెప్పాలి, ముఖ్యంగా హీరోయిజం ఎలివేట్ అయ్యే సీన్స్, వార్ సీన్స్, డైలాగ్స్ విషయం లో తన మార్క్ కనిపించింది.

ఇక మొత్తం మీద ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే…. ముందుగా ప్లస్ పాయింట్స్
మెగాస్టార్ చిరంజీవి పెర్ఫార్మెన్స్
ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ తర్వాత 30 నిమిషాలు
క్లైమాక్స్
వార్ సీన్స్
ప్రొడక్షన్ వాల్యూస్
డైరెక్షన్
స్టార్ కాస్ట్
ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే
లెంత్ ఎక్కువ అవ్వడం
స్లో నరేషన్….

ఈ రెండు మైనస్ పాయింట్స్ తప్పితే సినిమాలో ఇక మైనస్ పాయింట్స్ లేవు… పేట్రియాటిక్ నేపద్యంలో వచ్చిన సైరా నరసింహా రెడ్డి, ఓవరాల్ గా అంచనాలను అందుకుని మెప్పించింది, సినిమా కి మొత్తం మీద మేం ఇస్తున్న రేటింగ్ 3.5 స్టార్స్… అందరికీ నచ్చే సినిమా ఇది…మెగాస్టార్ రెండున్నర ఏళ్ల కష్టానికి బాక్స్ ఆఫీస్ రికార్డులు మాత్రమె సరైన ప్రతిఫలం…

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here