టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర మిగిలిన వర్షన్స్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉన్నా కానీ తెలుగు రాష్ట్రాలలో మాత్రం అల్టిమేట్ కలెక్షన్స్ తో ఊచకోత కోసింది అని చెప్పాలి. సినిమా ముఖ్యంగా నైజాం సీడెడ్ మరియు వైజాగ్ ఏరియాలలో అల్టిమేట్ కలెక్షన్స్ ని సాధించి సంచలనం సృష్టించింది. ఓవరాల్ గా ఇప్పుడు బ్రేక్ ఈవెన్ కోసం మరింత కష్టపడాల్సి వస్తున్నా కానీ…
కొన్ని సెంటర్స్ లో సినిమా అల్టిమేట్ రికార్డులతో సంచలనం సృష్టించింది. సీడెడ్ ఏరియాలో ఆల్ టైం నాన్ బాహుబలి రికార్డ్ కొట్టిన సినిమా నైజాం లో కూడా ఆల్ టైం నాన్ బాహుబలి రికార్డ్ కొట్టిన విషయం తెలిసిందే, కాగా ఇక్కడ నాన్ బాహుబలి మూవీస్ లో…
మహేష్ బాబు మహర్షి సినిమా 30 కోట్లకు పైగా షేర్ ని అందుకుని సంచలనం సృష్టించగా తర్వాత వచ్చిన సాహో ఈ రికార్డ్ ను అందుకోలేదు. ఇక సైరా సినిమా అంచనాలను తట్టుకుని టోటల్ అన్ని చోట్లా కన్నా ముందు బ్రేక్ ఈవెన్ అయిన ఏరియా నైజాం ఏరియానే అవ్వడం విశేషం అని చెప్పొచ్చు.
ఇక సినిమా నైజాం ఏరియాలో 18 రోజుల్లో 32 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసి నాన్ బాహుబలి మూవీస్ లో సరికొత్త రికార్డ్ బెంచ్ మార్క్ ని సెట్ చేసింది. బాహుబలి సిరీస్ తర్వాత ఇక్కడ ఈ మార్క్ ని అందుకున్న మూడో సినిమా గా చరిత్రలో చోటు సొంతం చేసుకుంది సైరా నరసింహా రెడ్డి సినిమా.
ఈ ఏరియాలో 28 కోట్ల బిజినెస్ ని సొంతం చేసుకున్న సినిమా 18 రోజుల్లో మొత్తం మీద 32.08 కోట్ల షేర్ ని నైజాం ఏరియా లో సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. ఇక లాంగ్ రన్ లో మరో 60 లక్షల నుండి మరింత లాంగ్ రన్ ఉంటె 1 కోటి వరకు షేర్ ని ఇక్కడ అందుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు. మిగిలిన చోట్ల ఎలా ఉన్నా ఇక్కడ మాత్రం మిగిలిన మూవీస్ కి సైరా సాలిడ్ బెంచ్ మార్క్ ని సెట్ చేసింది.