మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో ఏకంగా 270 కోట్ల రేంజ్ బడ్జెట్ లో రెండున్నర ఏళ్ల కి పైగా రూపొందిన సినిమా సైరా నరసింహా రెడ్డి, బాక్స్ ఆఫీస్ దగ్గర గాంధీ జయంతి అలాగే దసరా సెలవుల అడ్వాంటేజ్ తో అత్యంత భారీ ఎత్తున రిలీజ్ అయిన ఈ సినిమా రిలీజ్ అవ్వడమే యునానిమస్ సూపర్ హిట్ రేంజ్ టాక్ తో రిలీజ్ అవ్వగా బాక్స్ ఆఫీస్ రికార్డుల దుమ్ము దుమారం…
చేస్తుందని ప్రతీ ఒక్కరు భావించారు. ఇప్పుడు సినిమా పరుగు ఆల్ మోస్ట్ ముగింపు దశకు చేరుకోగా సినిమా ఓవరాల్ ప్రదర్శన చూసి కూడా టాలీవుడ్ లో ప్రతీ ఒక్కరి మైండ్ బ్లాంక్ అయ్యింది అనే చెప్పాలి. ఆ రేంజ్ టాక్ ఏంటి ఈ కలెక్షన్స్ ఏంటి అన్న షాక్ తగిలింది.
కారణాలు ఏవైనా కావచ్చు కానీ సినిమా బాక్స్ ఆఫీస్ టార్గెట్ ని అందుకోవడం లో భారీ గా విఫలం అయింది, ఎంతలా అంటే మేజర్ ఏరియాలు అన్ని చూసుకున్నా సినిమా ను అమ్మిన రేటు ని దాటి బ్రేక్ ఈవెన్ అయిన ఏరియాలు మొత్తం మీద కేవలం రెండే రెండు మాత్రమె…
అది ఒకటి నైజాం ఏరియా కాగా మరోటి వైజాగ్ ఏరియా… ఈ రెండు ఏరియాలు తప్పితే మిగిలిన అన్ని ఏరియాల్లో సినిమా నష్టాలనే మిగిలించింది. ఇక ఇతర భాషల్లో సినిమా ప్రదర్శన గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. హిందీ లో మంచి అవకాశం ఉన్నా నిర్మాత యూనిట్ మినిమమ్ ప్రమోషన్ చేయకుండా…
అక్కడ చారిత్రిక డిసాస్టర్ అవ్వడానికి ప్రధాన కారణం అయ్యారు, అందునా పోటి లో కమర్షియల్ మూవీ ఉండటం అక్కడ దెబ్బ కొట్టిన సౌత్ వరకు మంచి టాక్ ఉన్నా తమిళ్ కేరళ ఆడియన్స్ హ్యాండ్ ఇవ్వగా కర్ణాటక లో కూడా లోకల్ మూవీస్ ఎఫెక్ట్ చూపగా ఓవర్సీస్ నిరాశ పరిచింది, ప్రెజర్ మొత్తం రెండు రాష్ట్రాల పై పడగా ఎలాగోలా బ్రేక్ ఈవెన్ దరిదాపుల్లోకి ఓవరాల్ గా వచ్చినా ఇప్పుడు ఆ మార్క్ ని దాటకుండానే పరుగును ముగించబోతుంది సినిమా.