అక్టోబర్ 2… నేషనల్ హాలిడే… ఆ రోజు ఇండియా లో ఇప్పుడు 2 క్రేజీ పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అవు తున్నాయి. ఒకటి పక్కా కమర్షియల్ మూవీ మరోటి పెట్రియాటిక్ నేపద్యం లో ఉన్న రియల్ లైఫ్ స్టొరీ… రెండు సినిమాలకు వాటి వాటి రేంజ్ లో క్రేజ్ అయితే పీక్స్ లో ఉండ గా రెండు సినిమాల్లో ఏది ఫైనల్ గా బాక్స్ ఆఫీస్ ను ఏలుతుంది అన్నది కొన్ని రోజుల్లో తేలనుంది.
ఆ రెండు సినిమాలే సైరా నరసింహా రెడ్డి మరియు వార్… ఈ రెండు సినిమాలు అక్టోబర్ 2 న అత్యంత భారీ ఎత్తున ఇండియా వైడ్ ఆల్ మోస్ట్ 80% థియేటర్స్ లో ఈ రెండు సినిమాలు రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్నాయి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు ఎలాంటి కలెక్షన్స్…
ఈ సినిమా లు సొంతం చేసుకుంటాయి అన్నది ఆసక్తిగా మారింది. కాగా ట్రేడ్ లో ఈ రెండు సినిమాల ఫస్ట్ డే కలెక్షన్స్ రేంజ్ ఎలా ఉంటుంది అన్నది ఆసక్తి కరంగా మారగా… వారి అంచనాల ప్రకారం రెండు సినిమాలు కలిపి మొదటి రోజు ఇండియా వైడ్ గా రికార్డుల దుమ్ము దుమారం చేసే అవకాశం ఉందని అంటున్నారు.
ముందుగా సైరా సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 50 కోట్ల రేంజ్ నెట్ కలెక్షన్స్, మిగిలిన చోట్ల 20 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని టోటల్ గా 70 కోట్ల కి అటూ ఇటూ గా నెట్ కలెక్షన్స్ ని అందుకోవచ్చు అంటున్నారు. ఇక వార్ సినిమా అన్ని వర్షన్స్ తో కలిపి 50 కోట్ల రేంజ్ కి…
ఏమాత్రం తక్కువ కాని నెట్ కలెక్షన్స్ అందుకోవచ్చు అంటున్నారు. దాంతో రెండు సినిమాలు కలిపి ఫస్ట్ డే 120 కోట్ల నుండి 130 కోట్ల దాకా నెట్ కలెక్షన్స్ ని అందుకోవచ్చు అని అంచనా వేస్తున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం అవుతుందో తెలియాలి అంటే అక్టోబర్ 3 న రిలీజ్ అయ్యే అఫీషియల్ కలెక్షన్స్ కోసం ఎదురు చూడాల్సిందే.