Home గాసిప్స్ సైరా కి అన్యాయం…అసలు ఏం జరుగుతుంది??

సైరా కి అన్యాయం…అసలు ఏం జరుగుతుంది??

0

     టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బడ్జెట్ తో భారీ రేంజ్ లో రెండున్నర ఏళ్లుగా తెరకెక్కిన సినిమా సైరా నరసింహా రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి కంబ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150 తర్వాత చేస్తున్న సినిమా అవ్వడం తో అంచనాలు అయితే పీక్స్ లో ఉన్నాయి. ఇక సినిమా ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథ ఆదారంగా తెరకెక్కుతున్న సినిమా అవ్వడం తో అందరి లోను ఆసక్తి మరింత పెరిగింది అని చెప్పాలి.

కాగా ఈ సినిమా రిలీజ్ కి మరి కొన్ని రోజుల సమయం మాత్రమె ఉండగా ఇప్పటి వరకు సినిమా కి ఇటు ఆంద్రప్రదేశ్ లో కానీ అటు తెలంగాణ లో కానీ రోజు కి 5 షోల అప్రూవల్ గురించి కానీ టాక్స్ ఎక్స్ సెప్షన్ గురించి కానీ ఒక్క న్యూస్ కూడా లేక పోవడం చర్చ కి దారి తీస్తుంది.

ఇది వరకు రిలీజ్ అయిన సినిమాల్లో రుద్రమదేవి కి తెలంగాణాలో టాక్స్ ఎక్స్ సెప్షన్ ఇవ్వగా ఆంధ్రాలో ఇవ్వలేదు. కానీ శాతకర్ణి గురించి తీసిన గౌతమీపుత్ర శాతకర్ణి కి మాత్రం రెండు చోట్లా టాక్స్ ఎక్స్ సెప్షన్ ఇచ్చారు. ఇక రీసెంట్ టైం రిలీజ్ అయిన చాలా పెద్ద సినిమాలకు…

రోజుకి 5 నుండి రోజు మొత్తం షోలు వేసుకునే అవకాశాన్ని ఇచ్చారు. కానీ ఆంగ్లేయుల పై పోరాడిన మొదటి వ్యక్తీ తెలుగు వాడు అయిన ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి లైఫ్ టైం స్టొరీ పై వస్తున్న సైరా నరసింహా రెడ్డి కి రెండు రాష్ట్రాలలో ఎలాంటి టాక్స్ ఎక్స్ సెప్షన్ గురించిన వార్తలు రాలేదు సరి కదా…

ఇప్పటికీ రోజు కి 5 షోల పర్మీషణ్ కూడా రాలేదు…. దాంతో మెగాస్టార్ సినిమాకి ఇలాంటి అడ్డంకులు ఏంటి అంటూ ఇండస్ట్రీ లో చర్చలు జరుగుతున్నాయి. మరి రిలీజ్ కి ఇంకో 2 రోజులు ఉంది కాబట్టి ఇంతలో ఏమైనా జరిగి టాక్స్ ఎక్స్ సెప్షన్ లు కానీ రోజు కి 5 షోలకు పైగా అవకాశం కానీ దొరుకుందేమో అని యూనిట్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here