Home టోటల్ కలెక్షన్స్ 60 కోట్ల సినిమా…టోటల్ కలెక్షన్స్ ఇవి!!

60 కోట్ల సినిమా…టోటల్ కలెక్షన్స్ ఇవి!!

0

     కోలివుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ నేర్కొంద పార్వాయి… రీసెంట్ గా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా లో అజిత్ కుమార్ ఆల్ మోస్ట్ స్పెషల్ క్యామియో టైప్ రోల్ చేశాడు. అయినా కానీ మెయిన్ స్త్రీం మూవీ రేంజ్ లో హైప్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా కూడా దుమ్ము లేపే విజయాన్ని సొంతం చేసుకుంది.

కాగా సినిమా ను లిమిటెడ్ బడ్జెట్ లోనే తీయగా సినిమా అజిత్ క్రేజ్ దృశ్యా ఏకంగా 60 కోట్ల రేంజ్ లో బిజినెస్ ని సొంతం చేసుకుంది. కాగా టోటల్ రన్ పూర్తీ అయ్యే సమయానికి బిజినెస్ ని రికవరీ చేసి విజయాన్ని సొంతం చేసుకుని ఈ ఇయర్ అజిత్ కి బాక్ టు బాక్…

హిట్లు పడేలా చేసింది ఈ సినిమా… బాలీవుడ్ సూపర్ హిట్ పింక్ రీమేక్ గా వచ్చిన ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే… తమిళనాడు లో 91.9 కోట్ల గ్రాస్ ని, కర్ణాటకలో 4.9 కోట్ల గ్రాస్ ని, కేరళలో 2.35 కోట్ల గ్రాస్ ని, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2.44 కోట్ల దాకా గ్రాస్ ని, ఓవర్సీస్ మొత్తం మీద 25 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుందట.

దాంతో టోటల్ గా ఇండియా లో సినిమా…101.59 కోట్ల గ్రాస్ ని 55.5 కోట్ల షేర్ ని వసూల్ చేయగా ఓవర్సీస్ లో 25 కోట్ల గ్రాస్ ని 13 కోట్ల షేర్ ని వసూల్ చేసిందట. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 126.59 కోట్ల గ్రాస్ కి 69.5 కోట్ల దాకా షేర్ ని అందుకుందట సినిమా…

అంటే సినిమాను అమ్మిన 60 కోట్లకు సినిమా ఫైనల్ రన్ లో ఏకంగా 9.5 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది, ఎక్స్ టెండెడ్ క్యామియో తో కూడా అజిత్ కుమార్ బాక్స్ ఆఫీస్ దగ్గర అల్టిమేట్ కలెక్షన్స్ తో తన స్టార్ పవర్ ని చూపెట్టి మరోసారి సంచలనం సృష్టించాడు అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here