బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా సిద్దార్థ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ టక్కర్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే.. వీకెండ్ లో తెలుగు రాష్ట్రాల్లో అతి కష్టం మీద 80 లక్షల లోపే షేర్ ని సొంతం చేసుకున్న టక్కర్(Takkar) మూవీ వర్కింగ్ డే లో కంప్లీట్ గా…
స్లో డౌన్ అయిపొయింది అని చెప్పాలి ఇప్పుడు. అతి కష్టం మీద 10 లక్షల రేంజ్ లో షేర్ ని సినిమా సొంతం చేసుకుని ఉండొచ్చు అని సమాచారం. తమిళ్ లో కూడా సినిమా భారీగా డ్రాప్ అవ్వగా సినిమా ఇక తేరుకునే అవకాశం లేదనే చెప్పాలి…
దాంతో ఈ సినిమాతో కంబ్యాక్ ఇవ్వాలి అనుకున్న సిద్దార్థ్(Siddarth) కి ఈ సినిమా నిరాశనే మిగిలించింది ఇప్పుడు. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర భారీగా దెబ్బ కొట్టిన ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ పరంగా మాత్రం మంచి జోరునే చూపించిందని సమాచారం.
సినిమా డిజిటల్ రైట్స్ అలాగే శాటిలైట్ రైట్స్ రెండూ కలిపి ఆల్ మోస్ట్ 15 కోట్ల రేంజ్ లో రేటుని సొంతం చేసుకున్నాయని సమాచారం. ఫ్లాఫ్స్ లో ఉన్న హీరోకి ఈ రేంజ్ లో నాన్ థియేట్రికల్ రైట్స్ సొంతం అవ్వడం అంటే మాములు విషయం కాదనే చెప్పాలి ఇప్పుడు.
కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సినిమా డీసెంట్ రిజల్ట్ ను సొంతం చేసుకుని ఉండే సిద్దార్థ్ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న కంబ్యాక్ సొంతం అయ్యి ఉండేది కానీ ఓవరాల్ గా సినిమా నిరాశనే మిగిలించింది. ఇలాంటి రిజల్ట్ తర్వాత సిద్దార్థ్ ఫ్యూచర్ మూవీస్ తో అయినా మంచి కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాడో చూడాలి.