Home న్యూస్ టక్కర్ మూవీ రివ్యూ-రేటింగ్!!

టక్కర్ మూవీ రివ్యూ-రేటింగ్!!

0

ఒకప్పుడు తెలుగులో లవర్ బాయ్ ఇమేజ్ తో కొన్ని తిరుగులేని హిట్స్ ని సొంతం చేసుకున్న హీరో సిద్దార్థ్(siddharth), నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు లాంటి క్లాసిక్ హిట్స్ తర్వాత కొన్ని ఇతర డీసెంట్ మూవీస్ ని కూడా సొంతం చేసుకున్నప్పటికీ కూడా తర్వాత వరుస ఫ్లాఫ్స్ తో తన మార్కెట్ ని కోల్పోయాడు… అడపాదడపా అప్పుడప్పుడు కొన్ని సినిమాలతో వచ్చినా పెద్దగా ఇంపాక్ట్ అయితే లేదనే చెప్పాలి.

ఇక ఇప్పుడు ఆడియన్స్ ముందుకు సిద్దార్థ్ నటించిన తెలుగు తమిళ్ మూవీ టక్కర్(takkar) రీసెంట్ గా రిలీజ్ అయింది. మరి సినిమా ఎలా ఉంది ఎంతవరకు మెప్పించిందో లాంటి విశేషాలను తెలుసుకుందాం పదండీ… ముందుగా స్టొరీ పాయింట్ విషయానికి వస్తే… డబ్బున్న వ్యక్తీగా మారాలను ఊహించుకునే హీరోకి…

డబ్బే అన్ని సమస్యలకు డబ్బే ప్రధాన కారణం అనుకునే హీరోయిన్ కలుస్తుంది. తర్వాత వీళ్ళ లైఫ్ ఎలా టర్న్ తీసుకుంది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే… చాలా బేసిక్ స్టొరీ పాయింట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఫస్టాఫ్ వరకు కథ పడుతూ లేస్తూ సాగినా కొంచం అక్కడక్కడా ఎంటర్ టైన్ మెంట్…

వర్కౌట్ అవ్వడంతో పర్వాలేదు అనిపిస్తుంది, కానీ సెకెండ్ ఆఫ్ లో కథ తలాతోకా లేకుండా సాగడంతో చూస్తున్న ఆడియన్స్ ఓ రేంజ్ లో బోర్ ఫీల్ అయ్యేలా చేయగా క్లైమాక్స్ అయినా ఇంప్రెస్ చేస్తుంది అనుకుంటే చాలా రొటీన్ గా క్లైమాక్స్ కూడా ముగిసి నిరాశ పరుస్తుంది…

సిద్దార్థ్ లుక్ ఏమాత్రం సెట్ అవ్వలేదు, తన నటన పర్వాలేదు, హీరోయిన్ జస్ట్ ఓకే అనిపించగా మిగిలిన యాక్టర్స్ లో యోగిబాబు పర్వాలేదు అనిపిస్తాడు, విలన్ ముందు సీరియస్ గా అనిపించినా తర్వాత తేలిపోతాడు… సంగీతం యావరేజ్ గా ఉండగా ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే చాలా వీక్ గా ఉన్నాయి.

ప్రొడక్షన్ వాల్యూస్ మెప్పించినా డైరెక్షన్ తీవ్రంగా నిరాశ పరుస్తుంది. చాలా తిన్ స్టొరీ లైన్ తో తెరకెక్కిన టక్కర్ మూవీ కొన్ని సీన్స్ అక్కడక్కడా పర్వాలేదు అనిపించినా పూర్తిగా చూడాలి అంటే మాత్రం చాలా ఓపిక అవసరం అని చెప్పాలి. అంత ఓపిక మీకుంటే అతి కష్టం మీద ఒకసారి చూడొచ్చు… మొత్తం మీద సినిమాకి మా రేటింగ్ 2.25 స్టార్స్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here