టాలీవుడ్ లో ప్రతీ ఇయర్ డబ్బింగ్ మూవీస్ రిలీజ్ అవుతూనే ఉంటాయి, అందులో మంచి కంటెంట్ ఉన్న సినిమా లను తెలుగు ఆడియన్స్ ఆదరిస్తూ ఉంటారు, కానీ ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాల్లో కొన్ని సినిమాలు భారీ విజయాలను నమోదు చేశాయి, కానీ ఒక్క ఇయర్ లో మాత్రం మన సినిమా లను కూడా మించి భారీ లాభాల సొంతం చేసుకున్నాయి ఈ డబ్బింగ్ మూవీస్.. ఆ ఇయరే 2005 అని చెప్పొచ్చు.
ఆ ఇయర్ లో కూడా మన సినిమాలు నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఛత్రపతి, అతనొక్కడే, భద్ర, బన్నీ లాంటి హిట్లు, అతడు లాంటి క్లాసిక్ టీవీ ఎంటర్ టైనర్స్ వచ్చినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర డబ్బింగ్ మూవీస్ భారీ లాభాలు సొంతం చేసుకుని చరిత్ర లో ఎప్పుడూ లేని విధంగా చుక్కలు చూయించాయి…
ముందుగా ఏప్రిల్ లో రజినీ చంద్రముఖి సినిమా సైలెంట్ గా రిలీజ్ అయింది, రజినీ ది సైడ్ రోల్ అని, లేడీ ఓరియెంటెడ్ మూవీ అని ఊదర గొట్టి సినిమా కి మొత్తం మీద 5.6 కోట్ల బిజినెస్ అందుకోగా ఫైనల్ రన్ లో ఏకంగా 13.10 కోట్ల షేర్ అందుకుని బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
ఇక తర్వాత శంకర్ విక్రం ల కాంబో లో వచ్చిన అపరిచితుడు భారీ హైప్ నడుమ రిలీజ్ అవ్వగా సినిమా కి 7 కోట్ల క్రేజీ బిజినెస్ తెలుగు లో జరిగింది, ఫైనల్ రన్ లో 7 కోట్ల ప్రాఫిట్ తో 14 కోట్ల షేర్ ని అందుకుని సంచలనం సృష్టించింది, ఇక తర్వాత సూర్య గజినీ దుమ్ము దుమారం చేసే విజయాన్ని సొంతం చేసుకుంది. సినిమా మొత్తం మీద 3.8 కోట్ల బిజినెస్ సాదించగా…
బాక్స్ ఆఫీస్ దగ్గర 12 కోట్ల మేర షేర్ ని అందుకుని భారీ లాభాలను సొంతం చేసుకుంది, ఇక ఈ సినిమాలే కాకుండా పందెం కోడి, ప్రేమిస్తే లాంటి ఇతర డబ్ మూవీస్ కూడా బాగానే డామినేట్ చేశాయి కానీ ఈ మూడు సినిమాలకు మాత్రం జనాలు ప్రతీ వీకెండ్ విరగబడి థియేటర్స్ కి వెళ్ళేవారు. దాంతో ఆ ఇయర్ బిగ్గెస్ట్ హిట్ మూవీస్ కి కూడా తీవ్ర పోటి ఇచ్చాయి ఈ సినిమాలు… దాంతో డబ్బింగ్ మూవీస్ కి టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇయర్ గా 2005 నిలిచిపోతుంది అని చెప్పొచ్చు.