Home న్యూస్ తెల్లవారితే గురువారం రివ్యూ…హిట్టా-ఫట్టా!!

తెల్లవారితే గురువారం రివ్యూ…హిట్టా-ఫట్టా!!

0

మత్తు వదలరా సినిమాతో ఆకట్టుకున్న శ్రీ సింహా ఇప్పుడు రెండో ప్రయత్నంగా ఆడియన్స్ ముందుకు తెల్లవారితే గురువారం అంటూ రొమాంటిక్ రోమ్ కాం మూవీ తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు, మరి ఈ సారి ఎంతవరకు ఆకట్టుకున్నాడో తెలుసుకుందాం పదండీ… ముందుగా కథ పాయింట్ కి వస్తే శ్రీ సింహా మిషా నారంగ్ ల పెళ్లి పనులు జరుగుతూ ఉండగా ఇద్దరూ పెళ్లి నుండి తప్పించుకోవాలని చూస్తారు… అనుకోకుండా ఇద్దరు కలుస్తారు… తర్వాత ఒకరి ఫ్లాష్ బ్యాక్ ఒకరు…

చెప్పుకోవడం జరుగుతుంది…తర్వాత ఏమైంది, అసలు ఇద్దరూ పెళ్లి నుండి ఎందుకు తప్పుకోవాలని చూశారు, అసలు కలిశారా లేదా లాంటి విశేషాలు అన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. సినిమా మొదలు అవ్వడం ఆసక్తికరమైన సీన్స్ తో మొదలు అవుతుంది, కథ ఏంటో తెలియదు కానీ మంచి సీన్స్ కొన్ని కామెడి పంచులు సినిమాతో కనెక్ట్ అయ్యేలా చేస్తుంది.

కానీ కొద్ది సేపటి తర్వాత లీడ్ పెయిర్ ఇద్దరూ తమ తమ ఫ్లాష్ బ్యాక్స్ ని మొదలు పెట్టడం నుండి సినిమా గాడి తప్పుతుంది. అక్కడక్కడా కొన్ని మంచి సీన్స్ ఆకట్టుకున్నా కథ చాలా నీరసంగా రొటీన్ గా సాగుతుంది. ఇలాంటి రామ్ కాం లు కూడా అనేకం ఇది వరకు చాలా వచ్చాయి. ఇందులో ఏమాత్రం కొత్తదనం లేదనే చెప్పాలి.

కానీ శ్రీ సింహా ఉన్నంతలో మంచి పెర్ఫార్మెన్స్ తోనే ఆకట్టుకోగా, హీరోయిన్స్ ఇద్దరూ పర్వాలేదు అనిపించుకున్నారు. చిత్ర శుక్ల రోల్ కొంచం ఇరిటేట్ కూడా చేస్తుంది. ఇక సినిమా కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ సత్య కామెడి సీన్స్… తను కనిపించేది తక్కువ సీన్స్ అయినా కానీ కనిపించిన ప్రతీ సారి తన కామెడీ తో నవ్విస్తాడు సత్య… ఇక వైవా హర్ష కూడా పర్వాలేదు…

మిగిలిన యాక్టర్స్ అందరూ ఉన్నంతలో పర్వాలేదు అనిపించుకున్నారు. కాలభైరవ సాంగ్స్ ఓకే అనిపించే విధంగా ఉండగా… బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా పర్వాలేదు. ఇక ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే చాలా స్లో గా నీరసంగా సాగుతుంది, సినిమాటోగ్రఫీ బాగుండగా, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే…

చాలా సింపుల్ స్టొరీని మొదటి 20 – 25 నిమిషాలు బాగానే స్టార్ట్ చేసినా తర్వాత డైరెక్టర్ కంప్లీట్ గా ట్రాక్ తప్పాడు, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లు, తర్వాత జరిగే పరిణామాలు అన్నీ కూడా పరమ రొటీన్ గా ఆడియన్స్ అంచనాలను తగ్గట్లు గానే సాగుతూ ఉంటాయి, ఎంటర్ టైన్ మెంట్ వరకు ఫస్టాఫ్ బాగుంది లే అనిపించినా సెకెండ్ ఆఫ్ ట్రాక్ కంప్లీట్ గా తప్పుతుంది.

మొత్తం మీద అక్కడక్కడా సీన్స్ వైజ్ సినిమా పర్వాలేదు అనిపించినా కానీ పరమ రొటీన్ రాం కాం మూవీ అని చెప్పాలి. సత్య కామెడీ సీన్స్ కోసం ఒకసారి చూడొచ్చు… సినిమాకి మొత్తం మీద మా రేటింగ్ 2.5 స్టార్స్… ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here