Home న్యూస్ తెలుగు లో హైయెస్ట్ లాభాలు సొంతం చేసుకున్న టాప్ 3 డబ్బింగ్ మూవీస్!

తెలుగు లో హైయెస్ట్ లాభాలు సొంతం చేసుకున్న టాప్ 3 డబ్బింగ్ మూవీస్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు లో స్ట్రైట్ మూవీస్ తో పాటు డబ్ మూవీస్ కూడా ఎప్పటి కప్పుడు భారీగానే రిలీజ్ అవుతూ ఉండగా అందులో కొన్ని సినిమాలు మాత్రమే ఆడియన్స్ అంచనాలను అందుకోగా అందులో కూడా కొన్ని సినిమాలు సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపినవి కూడా ఉన్నాయి…

వాటిలో ఈ ఇయర్ లో వచ్చిన సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన జైలర్(Jailer Movie) టోటల్ రన్ లో ఊహకందని కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది. తర్వాత కాంతార(Kantara) మూవీ సంచలన కలెక్షన్స్ ని అందుకోగా తర్వాత ప్లేస్ లో బిచ్చగాడు(Bichagadu) మూవీ…

బాక్స్ ఆఫీస్ దగ్గర అల్టిమేట్ కలెక్షన్స్ తో సంచలనం సృష్టించింది. మొత్తం మీద టోటల్ రన్ లో బిచ్చగాడు సినిమా 50 లక్షల బిజినెస్ మీద 16.80 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని 16.30 కోట్ల రేంజ్ లో మమ్మోత్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది…

ఇక రెండో ప్లేస్ లో కాంతార సినిమా 2 కోట్ల వాల్యూ బిజినెస్ మీద 29.65 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని ఆల్ మోస్ట్ 27.65 కోట్ల రేంజ్ లో మమ్మోత్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. ఇక టాప్ ప్లేస్ లో ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్…

నటించిన జైలర్ మూవీ 12 కోట్ల బిజినెస్ మీద 47.90 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుని పరుగును పూర్తి చేసుకోగా 12 కోట్ల బిజినెస్ మీద 35.90 కోట్ల రేంజ్ లో ఎపిక్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని టాప్ లో నిలిచింది. ఫ్యూచర్ లో వచ్చే డబ్ మూవీస్ లో ఈ రికార్డ్ ను బీట్ చేసే సినిమాలుగా ఏవి నిలుస్తాయో చూడాలి.

Jailer Movie Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here