కరోనా ఎంటర్ అయ్యాక వరల్డ్ మొత్తం మారిపోయింది, కొన్ని నెలల పాటు అందరూ ఇళ్ళకే పరిమితం అవ్వగా ఎప్పుడెప్పుడు ఈ పరిస్థితులు సెట్ అవుతాయా తిరిగి బయట తిరిగుతామా అని ఎదురు చూస్తుండగా కరోనా ఎంతకీ తగ్గక పోవడం తో దాన్ని మర్చిపోయి ఎలా అయితే అలా అయింది అని కరోనా ని పట్టించుకోకుండా చాలా మంది బయట ప్రపంచం లో బిజీగా మారగా… థియేటర్స్ ని కూడా చాలా దేశాల్లో…
రీ ఓపెన్ చేయగా పాత సినిమాలను మాత్రం రీ రిలీజ్ చేసి జనాలు వస్తున్నారో లేదో అన్న డౌట్ లో ఉండగా… కొన్ని సినిమాలకు మంచి కలెక్షన్స్ దక్కినప్పటికీ అనుకున్న రేంజ్ అంచనాలను అయితే అందుకునే రేంజ్ కలెక్షన్స్ అయితే రాలేదు. ఇండియా లో థియేటర్స్ ఓపెనింగ్ కి మరింత…
సమయం పట్టేలా ఉండగా వరల్డ్ లో చాలా దేశాల్లో థియేటర్స్ ని రీ ఓపెన్ చేశాక రిలీజ్ అయిన బిగ్ మూవీ టెనెట్ దుమ్ము లేపే ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది. క్రిస్టఫర్ నోలన్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా పై హైప్ ఓ రేంజ్ లో ఉండగా…
కరోనా టైం ఇంకా అవ్వక పోయినా కానీ సినిమాను రిలీజ్ చేసి తీరాల్సిందే అని డిసైడ్ అయిన మేకర్స్ వరల్డ్ లో కరోనా ప్రభావం తక్కువగా ఉన్న చాలా దేశాల్లో సినిమాను ఈ నెల 26 న రిలీజ్ చేయగా సినిమా ఇప్పటి వరకు 55 మిలియన్స్ కి పైగా గ్రాస్ కలెక్షన్స్ ని వరల్డ్ వైడ్ గా అందుకుని దుమ్ము లేపింది.
అంటే ఇండియన్ కరెన్సీ లో చూస్తె ఇది ఏకంగా 400 కోట్ల మార్క్ ని అందుకునే రేంజ్ కలెక్షన్స్ అనే చెప్పాలి.. మొదటి వీకెండ్ కే ఈ రేంజ్ లో కలెక్షన్స్ వచ్చాయి అంటే… వరల్డ్ సినీ లవర్స్ కొత్త సినిమాలను థియేటర్స్ లో చూడటానికి ఏ రేంజ్ లో ఉబలాట పడుతున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఇండియా లో థియేటర్స్ రీ ఓపెన్ చేస్తే ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.