పరిస్థితులు బాగుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఊచకోత కోయాల్సిన సినిమా ఇప్పుడు ఉన్న పరిస్థితుల వలన ఎదురుదెబ్బ తిని మొదటికే మోసం తెచ్చుకుంది, హాలీవుడ్ ప్రఖ్యాత డైరెక్టర్ క్రిస్టఫర్ నోలన్ డైరెక్షన్ లో వచ్చే సినిమాలు అంటే ఆడియన్స్ లో ఓ రేంజ్ లో క్యూరియాసిటీ ఉంటుంది, ది డార్క్ నైట్ సిరీస్, ఇంసేప్షన్, ఇంటర్ స్టేల్లర్ లాంటి ఎపిక్ మూవీస్ డైరెక్ట్ చేసిన నోలన్…
డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ టెనెట్ కోసం వరల్డ్ వైడ్ సినీ ఆడియన్స్ ఎంతో ఆశగా ఎదురు చూడగా సినిమా ను జనాలు ఎలా అయినా చూస్తారు అని భావించిన నోలన్ పాండమిక్ పరిస్థితులలో కూడా ధైర్యం చేసి టెనెట్ సినిమా ను పరిస్థితులు సద్దుకున్న…
దేశాలలో రిలీజ్ చేయగా సినిమా కి పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ దక్కినా కానీ అవి సినిమా సాధించిన బిజినెస్ కి సినిమా కి ఉన్న సత్తాతో పోల్చుకుంటే చాలా తక్కువ కలెక్షన్స్ అనే చెప్పాలి. సినిమా మొత్తం మీద వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే….
500 మిలియన్ డాలర్స్ ని వరల్డ్ వైడ్ గా అందుకోవాల్సి ఉండగా సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ మొత్తం మీద 307 మిలియన్ డాలర్స్ మార్క్ ని మాత్రమె అందుకుంది, అంటే ఇండియన్ కలెక్షన్స్ లో ఈ లెక్క 2250 కోట్ల దాకా ఉంటుంది, లాస్ట్ వీకెండ్ సినిమా మొత్తం మీద కేవలం 4 మిలియన్స్ లోపు కలెక్షన్స్ ని మాత్రమె వరల్డ్ వైడ్ గా అందుకోవడం తో…
ఇక లాంగ్ రన్ లో మహా అయితే 350 మిలియన్ మార్క్ ని అందుకుంటే గొప్ప విషయమే అని, అంతకుమించి ముందుకు వెళ్ళే అవకాశం లేదని అంటున్నారు, దాంతో సినిమా 1 బిలియన్ డాలర్స్ ని అవలీలగా అందుకునే సత్తా ఉన్నా సినిమానే అయినా కానీ పరిస్థితుల వలన సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్ మూవీ గా పరుగును ముగించబోతుంది.