కరోనా వలన వరల్డ్ మొత్తం ఆల్ మోస్ట్ 7 నెలలు ఆగిపోయిన విషయం తెలిసిందే, 7 నెలల తర్వాత కూడా మిగిలిన అన్ని పనులు మళ్ళీ మామూలు పరిస్థితికి వస్తున్నా కానీ సినిమాల విషయానికి వస్తే మాత్రం ఇంకా అన్ని మాములు స్టేజ్ కి రావడానికి మరింత టైం పట్టే అవకాశం ఎంతైనా ఉన్న నేపధ్యంలో కొత్త సినిమాలు రిలీజ్ చేయాలి అంటే భయపడుతున్న టైం లో హాలివుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన…
క్రిస్టఫర్ నోలన్ డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ టెనెట్ ఈ పాండమిక్ ని కూడా తట్టుకుని సెలెక్టివ్ ఏరియాలలో రిలీజ్ ని సొంతం చేసుకోగా సినిమా కి ఆరంభం బాగానే దక్కినా కానీ జనాలు మరీ అనుకున్న రేంజ్ లో థియేటర్స్ కి రాక పోవడం తో ఓవరాల్ గా…
చూసుకుంటే మాత్రం నిరాశనే మిగిలింది, సినిమా వరల్డ్ వైడ్ గా 500మిలియన్స్ డాలర్స్ ల బిజినెస్ ని సొంతం చేసుకోగా అంత వసూళ్ళని రాబడితేనే బ్రేక్ ఈవెన్ అవుతుంది అన్న టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పుడు పరుగు పూర్తీ అయ్యే టైం కి ఆ మార్క్ కి…
చాలా దూరంగానే ఆగిపోయింది ఈ సినిమా… మొత్తం మీద సినిమా ఫైనల్ రన్ కంప్లీట్ అయ్యే టైం కి వరల్డ్ వైడ్ గా 356M డాలర్స్ కలెక్షన్స్ ని మాత్రమే వసూల్ చేసింది. సినిమా కి అద్బుతమైన టాక్ లభించగా మామూలు రోజులు అయ్యి ఉంటె సినిమా మినిమం 1 బిలియన్ డాలర్స్ కి తగ్గని కలెక్షన్స్ ని సొంతం చేసుకునేది కానీ…
కరోనా టైం లో థియేటర్స్ లో డేర్ గా రిలీజ్ అయిన సినిమా మొత్తం మీద బాక్స్ ఆఫీస్ ఫ్లాఫ్ గా నిలిచినా కానీ కలెక్షన్స్ పరంగా బాగానే రికవరీ చేసింది, ఇక ఇండియా లో ఈ సినిమా కోసం భారీగా ఎదురు చూస్తూ ఉండగా డిసెంబర్ 4 న రిలీజ్ కానున్న ఈ సినిమా ఇక్కడ ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి మరి.