బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) ఇప్పుడు సాలిడ్ కంబ్యాక్ కి సిద్ధం అవుతున్నాడు. సాయి పల్లవి హీరోయిన్ గా చందు మొండేటి డైరెక్షన్ లో రూపొందుతున్న బిగ్ బడ్జెట్ మూవీ తండేల్(Thandel Movie) ఆడియో సూపర్ డూపర్ హిట్ అవ్వగా ఆడియన్స్ ముందుకు సినిమా…
ఫిబ్రవరి 7న మంచి అంచనాల నడుమ రిలీజ్ కాబోతూ ఉండగా, సినిమా మీద యూత్ లో ఆడియన్స్ లో సాలిడ్ గా అంచనాలు ఉన్నాయి, టాక్ ఏమాత్రం బాగున్నా కూడా సినిమా ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ తో మాస్ రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి..
ఇక సినిమాను వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతూ ఉండగా నార్త్ అమెరికాలో సినిమా నాగ చైతన్య కెరీర్ లోనే ఆల్ టైం రికార్డ్ లెవల్ లో రిలీజ్ కి సిద్ధం అవుతుంది. ఆల్ మోస్ట్ 599 లోకేషన్స్ లో సినిమా నార్త్ అమెరికాలో గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకోవడానికి సిద్ధం చేస్తున్నారు…
మొత్తం మీద రికార్డ్ లెవల్ లో రిలీజ్ ను నార్త్ అమెరికాలో సొంతం చేసుకోబోతున్న తండేల్ మూవీ మిగిలిన ఏరియాల్లో కూడా భారీ లెవల్ లో రిలీజ్ కాబోతుంది….ఇక తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ టైంకి సంక్రాంతి సినిమాల హవా మొత్తం కూడా తగ్గిపోబోతుంది కాబట్టి…
తండేల్ మూవీ ఏమాత్రం టాక్ పాజిటివ్ గా ఉన్నా కూడా ఓపెనింగ్స్ నాగ చైతన్య కెరీర్ లో రికార్డ్ లెవల్ లో సొంతం అయ్యే అవకాశం ఎంతైనా ఉంది….బాక్ టు బాక్ ఫ్లాఫ్స్ తర్వాత ఈ సినిమాతో నాగ చైతన్య సెన్సేషనల్ కంబ్యాక్ ను సొంతం చేసుకోవడం ఖాయమని చెప్పాలి ఇప్పుడు.