Home న్యూస్ తండేల్ నైజాం బిజినెస్…నాగ చైతన్య మాస్!!

తండేల్ నైజాం బిజినెస్…నాగ చైతన్య మాస్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు ఫిబ్రవరి 7న గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్న యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) నటిస్తున్న లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) సినిమా మీద ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉండగా….ఆల్ రెడీ సాంగ్స్ సూపర్ హిట్ అవ్వగా…

రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా ట్రైలర్ కి కూడా ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా ఆల్ రెడీ నాన్ థియేట్రికల్ బిజినెస్ సాలిడ్ రేటుకి సొంతం అవ్వగా ఇప్పుడు థియేట్రికల్ బిజినెస్ కూడా…

ఎక్స్ లెంట్ రేట్స్ కి అమ్ముడు పోతూ ఉండటం విశేషం…నాగ చైతన్య బాక్ టు బాక్ ఫ్లాఫ్స్ లో ఉన్నప్పటికీ కూడా ఈ సినిమా మీద బజ్ సాలిడ్ గా ఉండటంతో బిజినెస్ కూడా యమ జోరుగా సాగుతుంది….ఇక సినిమా రీసెంట్ గా నైజాం ఏరియాలో…

వాల్యూ బిజినెస్ కంప్లీట్ అయ్యింది…ఓవరాల్ గా నైజాం ఏరియాలో వరుస ఫ్లాఫ్స్ లో ఉన్నప్పటికీ కూడా ఈ సినిమాకి 10.50 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ ను దక్కించుకుందని సమాచారం….సినిమా మీద ఉన్న బజ్ కి ఏమాత్రం టాక్ బాగున్నా కూడా ఓపెనింగ్స్ ఓ రేంజ్ లో..

కుమ్మేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…ఇక మిగిలిన ఏరియాల్లో కూడా సాలిడ్ బిజినెస్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న తండేల్ మూవీ నాగ చైతన్యకి బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కంబ్యాక్ మూవీగా నిలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి…

సినిమాలో ఇండియా పాకిస్థాన్ సీన్స్ మీదే రిజల్ట్ బేస్ అయ్యి ఉండగా…ఆ పోర్షన్  తక్కువగానే ఉంటుంది అని చెబుతూ ఉండటంతో జస్ట్ సినిమాకి కావాల్సిందల్లా ఒక్క పాజిటివ్ టాక్ అనే చెప్పాలి. ఇక సినిమా ఓపెనింగ్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here