టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ సైరా నరసింహా రెడ్డి రిలీజ్ అయ్యి 4 రోజులు పూర్తీ కాగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్ళతో రన్ అవుతూ దూసుకు పోతుంది, మిగిలిన చోట్ల ఎలా ఉన్నా రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రం సాలిడ్ వసూళ్ళ నే సినిమా సాధిస్తుంది. సినిమా లో మెగాస్టార్ పెర్ఫార్మెన్స్ ని మంచి అప్లాజ్ వస్తుండగా అన్ని సీన్స్ కి మించి క్లైమాక్స్ లో…
మెగాస్టార్ చిరంజీవి నటన, కళ్ళ తోనే హావభావాలు పకించడం లాంటివి అందరి నీ ఓ రేంజ్ లో మెచ్చుకునేలా చేస్తున్నాయి. ఇక వాటిని మించి మెగాస్టార్ చిరంజీవి ని ఒక్క సీన్ గురించి కచ్చితంగా ఎంత మెచ్చుకున్నా తక్కువే అని చెప్పాలి. సినిమా ను దాదాపు చాలా మంది చూసి ఉంటారు కాబట్టి.
ఆ సీన్ ని రివీల్ చేసినా పెద్దగా ఎఫెక్ట్ ఉండదు అని రివీల్ చేస్తున్నాం. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి రియల్ లైఫ్ స్టొరీ అన్న విషయం అందరికీ తెలిసిందే, బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాడిన నరసింహా రెడ్డి ని తర్వాత బందించి ఆయన తల నరికి ఊరి పొలిమేరల్లో చాలా కాలం ఉంచారు.
ఆ సీన్ ని సైరా లో పెడతారో లేదో అన్న అనుమానాలు రిలీజ్ కి ముందే ఉన్నాయి. ఎంత రియల్ లైఫ్ స్టొరీ అయినా మెగాస్టార్ చిరంజీవి తన సినీ లైఫ్ లో చనిపోవడం లాంటి యాంటీ క్లైమాక్స్ సీన్స్ చేసినప్పుడు ఎక్కువ సార్లు ఫ్యాన్స్ ఇష్టపడలేదు కానీ ఇది రియల్ లైఫ్ స్టొరీ అవ్వడం తో ఎలా రిసీవ్ చేస్తుంటారు అన్నది డౌట్ గా మారగా…
అందరు బహుశా ఆ తల నరికే సీన్ చూపించకుండా అక్కడికి ఎండ్ చేస్తారని భావించారు(మా తో సహో), కానీ సినిమా లో అలా చేయలేదు, హీరో తల నరకడం తర్వాత మొండి తలతోనే బ్రిటిష్ అధికారిని హీరో చంపడం తన తల ప్లేస్ లో సూర్యుడిని చూపడం…
బహుశా ఇండియన్ సినిమా హిస్టరీ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ షాట్స్ లో ఒకటి అని చెప్పొచ్చు. ఆ సీన్ ని సురేందర్ రెడ్డి అద్బుత టేకింగ్ తో నిలబెట్టాడు. కథ కి అది అవసరం కాబట్టి చేశారు. అది ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకుని స్టాండింగ్ అవేషన్ ని ఆ సీన్ కి ఇచ్చారు…
అలాంటి సీన్ ని మెగాస్టార్ ఒప్పుకోవడం చాలా పెద్ద విషయం అని చెప్పొచ్చు. టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఇప్పటి వరకు అలాంటి సన్నివేశం ఎవ్వరూ చేయలేదు. క్యారక్టర్ రోల్స్ కం హీరో గా చేసే సమయం లో శ్రీహరి గారు మాత్రమె హనుమంతు అనే సినిమా లో ఇలాంటి సీన్ చేశారు.
కానీ మెగాస్టార్ చిరంజీవి లాంటి కమర్షియల్ సూపర్ స్టార్ ఇలాంటి సీన్ ని ఒప్పుకోవడం విశేషం అనే చెప్పాలి. సినిమా లో ఆ సీన్ దాదాపు 2 నిమిషాల వ్యవధి కలిగి ఉంటుంది, తన తలని అలానే చూపిస్తారు. ఆ ఒక్క సీన్ ని ఒప్పుకోవడం లోనే మెగాస్టార్ చిరంజీవి రియల్ మెగాస్టార్ అని మెచ్చుకుని తీరాల్సిందే…మీరేమంటారు??