చిన్నప్పుడు ఎన్నో సార్లు చూసిన “ది లయన్ కింగ్” కార్టూన్ మూవీ అందరికీ గుర్తుండే ఉంటుంది, ఆ యానిమేషన్ మూవీ నే తిరిగి విజువలైజేషన్ చేసి 3D లో ఇప్పుడు డిస్నీ వారు అందించారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ఇండియా లో కూడా భారీ గా రిలీజ్ అవ్వగా రీజనల్ స్టార్స్ తో డబ్ చేసి సినిమా పై మంచి హైప్ ని తీసుకువచ్చారు. మరి సినిమా ఎంతవరకు అంచనాలను అందుకుందో తెలుసు కుందాం పదండీ..
కథ విషయానికి వస్తే ముఫాసా అంటే పడని తమ్ముడు స్కార్ ఎలాగైనా సామ్రాజ్యం తన వశం చేసుకోవాలని చూస్తాడు, ఇంతలో ముఫాసా కి సింబా పుట్టడం తో తానె రాబోయే కాలం లో రాజు అవుతాడని ప్రకటించడంతో ఇద్దరినీ అడ్డు తొలగించడానికి స్కార్ చేసిన పన్నాగంలో ముఫాసా మరణిస్తాడు, సింబా ఆ రాజ్యం వదిలేస్తాడు. తిరిగి సింబా ఎలా తన రాజ్యం సొంతం చేసుకున్నాడు అన్నది అసలు కథ.
యాసిటీస్ ఒరిజినల్ కార్టూన్ మూవీ స్టొరీ నే ఎలాంటి మార్పులు చేయకుండా తీసిన దర్శకుడు స్క్రీన్ ప్లే పరంగా చాలా స్లో నరేషన్ తో కొద్దిగా ఇబ్బంది పెట్టాడు, కానీ రీజనల్ స్టార్స్ తో చేసిన డబ్ ప్రయోగంతో కొన్ని చోట్ల మంచి కామెడీ సీన్స్ ఆకట్టుకున్నాయి.
తెలుగు డబ్ విషయానికి వస్తే సింబా గా నాని, జుంబా గా బ్రహ్మానందం, టిమోన్ గా ఆలీ ఎక్కువ మార్కులు సొంతం చేసుకున్నారు, వీళ్ళకి మించి స్కార్ గా జగపతిబాబు డబ్బింగ్ అదుర్స్ అనిపిస్తుంది. మొత్తం మీద సినిమాలో ప్లస్ పాయింట్స్ విజువల్స్ అలాగే పాత్రల మధ్య ఎమోషన్స్ ఆకట్టుకోగా…
ముందుగా చెప్పుకున్నట్లే స్క్రీన్ ప్లే స్లో గా ఉండటం కొంచం బోర్ ఫీల్ అయ్యేలా చేస్తుంది, అయినా కానీ చిన్నప్పటి గ్యాపకాలను నెమరు వేసుకోవాలి అనుకున్న వాళ్లకి ఇప్పటి చిన్న పిల్లలకి సినిమా బాగా నచ్చుతుందని చెప్పొచ్చు. సినిమాకి ఫైనల్ గా మా రేటింగ్ 3 స్టార్స్… న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.