బాక్స్ ఆఫీస్ దగ్గర రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ ది వారియర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి మొదటి ఎక్స్ టెండెడ్ 4 డేస్ వీకెండ్ లో తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 14.59 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. కాగా సినిమా రిలీజ్ కి ముందు అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తె సినిమా నిరాశ పరచడం ఖాయం అనిపించింది, రిలీజ్ అయిన తర్వాత టాక్ చూసిన తర్వాత ఇక సినిమా…
తేరుకుంటుందో లేదో అని అందరూ అనుకున్నారు….. అది కొంతవరకు నిజం అయినా కానీ సినిమా వీకెండ్ లో పర్వాలేదు అనిపించే రేంజ్ కలెక్షన్స్ ని టికెట్ హైక్స్ ని, వర్షాలను మరియు నెగటివ్ టాక్ ని తట్టుకుని సొంతం చేసుకుంది. ఆ రేట్స్ కి జనాలు వస్తారో రారో అన్న డౌట్స్ కూడా ఉండగా….
ఆన్ లైన్ బుకింగ్స్ ఎలా ఉన్నప్పటికీ కూడా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ సాలిడ్ గా ఉండటం, అది కూడా వర్షాలను తట్టుకుని సినిమాను చూడటానికి జనాలు రావడం విశేషం, నెలన్నర నుండి జనాలు థియేటర్స్ రాకుండా ఉండగా ఈ సినిమా కి…..
అన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ థియేటర్స్ కి జనాలు వచ్చారు, టాక్ పాజిటివ్ గా ఉండి, టికెట్ రేట్స్ రీజనబుల్ గా ఉండి ఉంటే సినిమా ఇంకా బెటర్ గా సినిమాకి కలెక్షన్స్ సొంతం అయ్యి ఉండేవి అని చెప్పాలి. కానీ రిలీజ్ కి ముందు జనాలు వస్తారో రారా అన్న అనుమానాలను మాత్రం చెరిపేసి ఈ సినిమా చాలా వరకు అవరోధాలను ఎదురుకున్నప్పటికీ కూడా…
థియేటర్స్ కి జనాలను రప్పించగలిగింది. ఈ విషయంలో మాత్రం సినిమా సక్సెస్ అయినట్లే అని చెప్పాలి. ప్రస్తుతం జనాలకు కావాల్సింది, నార్మల్ టికెట్ రేట్స్ ఓ మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమా… అలాంటి సినిమా వస్తే జనాలు తిరిగి థియేటర్స్ కి భారీ ఎత్తున వచ్చి మునుపటిలా సినిమాలను ఎంజాయ్ చేసే అవకాశం ఎంతైనా ఉంటుంది.