Home Uncategorized ఇదే ఫైనల్…ది ఫ్యామిలీ స్టార్ ఫైనల్ టాక్ ఇదే!!

ఇదే ఫైనల్…ది ఫ్యామిలీ స్టార్ ఫైనల్ టాక్ ఇదే!!

0

ఈ సమ్మర్ లో ఆడియన్స్ ముందుకు గ్రాండ్ గా రిలీజ్ అయిన యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) పరశురాం(Parasuram) ల క్రేజీ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ది ఫ్యామిలీ స్టార్(The Family Star Movie) ప్రీమియర్స్ పూర్తి అయిన తర్వాత యావరేజ్ టు ఎబో యావరేజ్ లెవల్ లో టాక్ ను సొంతం చేసుకోగా…

రెగ్యులర్ షోల తర్వాత సినిమాకి మిక్సుడ్ రెస్పాన్స్ సొంతం అయింది, ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోలు కంప్లీట్ అయ్యే టైంకి రెగ్యులర్ ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ నుండి సినిమాకి ఎలాంటి టాక్ వచ్చింది అన్నది ఆసక్తిగా మారగా ఫ్యామిలీ ఆడియన్స్ విషయానికి వస్తే సినిమాలో ఫస్టాఫ్ లో చూపించిన మిడిల్ క్లాస్ లైఫ్ కొద్ది వరకు ఆకట్టుకోగా…

కొన్ని ఫ్యామిలీ సీన్స్ అలాగే హీరో హీరోయిన్స్ ల సీన్స్ పర్వాలేదు అనిపించేలా ఉన్నాయని, కానీ సెకెండ్ ఆఫ్ కథ మాత్రం పట్టాలు తప్పినట్లు అనిపించింది అని అంటూ ఉండగా ఓవరాల్ గా సినిమా పర్వాలేదు ఒకసారి చూడొచ్చు అనిపించేలా ఉందని అంటున్నారు….ఇక రెగ్యులర్ మూవీ లవర్స్ నుండి మాత్రం…

మిక్సుడ్ రెస్పాన్స్ టు నెగటివ్ టాక్ వినిపిస్తుంది ఎక్కువగా… అసలు కథనే లేకుండా డైరెక్టర్ సినిమాను తీశాడని, ఫస్టాఫ్ ఎలాగోలా కంప్లీట్ అయినా కూడా సెకెండ్ ఆఫ్ మాత్రం కంప్లీట్ గా ట్రాక్ తప్పింది అని అంటున్నారు…. ముఖ్యంగా టైం స్క్వేర్ దగ్గర తీసిన సీన్స్ అయితే క్రింజ్ లెవల్ లో అనిపించాయని,

మొత్తం మీద గీత గోవిందం కాంబో నుండి వచ్చిన సినిమా నుండి ఇంకా ఎక్కువగా ఎక్స్ పెర్ట్ చేశామని….కానీ సినిమా ఆ అంచనాలను అయితే అందుకోలేక పోయింది అని అంటున్నారు. మొత్తం మీద సినిమాకి రెగ్యులర్ ఆడియన్స్ నుండి మిక్సుడ్ రెస్పాన్స్ వినిపిస్తూ ఉండగా ఓవరాల్ గా డే ఎండ్ అయ్యే టైంకి సినిమాకి….

ఓవరాల్ టాక్ మాత్రం మిక్సుడ్ టు యావరేజ్ లెవల్ లో ఉంది, కానీ సినిమాకి ఉన్న బిగ్ అడ్వాంటేజ్ అప్ కమింగ్ డేస్ లో హాలిడేస్ చాలానే ఉండటంతో సినిమా టార్గెట్ ఆడియన్స్ సపోర్ట్ తో జోరు చూపించే ఛాన్స్ ఉంది. మరి సినిమా ఎంతవరకు ఈ టాక్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర టార్గెట్ ను అందుకోగలుగుతుందో లేదో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here