Home న్యూస్ ది రాజా సాబ్ గ్లిమ్స్ రివ్యూ….కెరీర్ లో ఫస్ట్ టైం ఇది!!

ది రాజా సాబ్ గ్లిమ్స్ రివ్యూ….కెరీర్ లో ఫస్ట్ టైం ఇది!!

0

బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా రేంజ్ లో బిగ్గెస్ట్ స్టార్స్ లో ఒకరిగా మారిపోయిన రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) సినిమా సినిమాకి తన రేంజ్ ని పెంచుకుంటూ దూసుకు పోతూ ఉండగా లేటెస్ట్ గా కల్కి మూవీ(Kalki 2898 AD Movie) తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి ఏకంగా 1000 కోట్లకు పైగా వసూళ్ళతో మాస్ ఊచకోత కోసిన తర్వాత….

ఇప్పుడు మరోసారి ఆడియన్స్ ను డిఫెరెంట్ జానర్ లో అలరించడానికి సిద్ధం అవుతున్నాడు. కెరీర్ లో డిఫెరెంట్ జానర్ మూవీస్ ని ట్రై చేస్తూ మిగిలిన స్టార్స్ కన్నా కూడా యమ జోరుగా దూసుకు పోతున్న ప్రభాస్ ఇప్పుడు కెరీర్ లో మొట్ట మొదటి సారిగా…

హర్రర్ జానర్ లోకి ఎంటర్ కాబోతున్నాడు…మీడియం రేంజ్ మూవీస్ తో తనని తానూ ప్రూవ్ చేసుకున్న డైరెక్టర్ మారుతి డైరెక్షన్ లో ఇప్పుడు ఆడియన్స్ ముందుకు ది రాజా సాబ్(The Raja Saab Movie) తో రాబోతున్న ప్రభాస్ ఈ సారి ఈ సినిమాలో…

హర్రర్ రొమాంటిక్ కామెడీ జానర్ తో రచ్చ చేయడానికి సిద్ధం అవుతున్నాడు. రీసెంట్ గా సినిమా అఫీషియల్ గ్లిమ్స్ ను రిలీజ్ చేయగా ప్రభాస్ న్యూ డార్లింగ్ లుక్ బాగా ఆకట్టుకుందని చెప్పాలి. గ్లిమ్స్ అంతా బాగున్నా బ్యాగ్రౌండ్ స్కోర్ టైటిల్ రివీల్ వీడియోలోదే ఇక్కడ కూడా వాడి ఉంటే ఇంపాక్ట్ మరో రేంజ్ లో ఉండేది అనిపించింది…

ఇక ఆడియన్స్ ముందుకు ఈ సినిమాను వచ్చే సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న రిలీజ్ చేయబోతున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ప్రభాస్ అప్ కమింగ్ మూవీస్ లో పూర్తి డిఫెరెంట్ అండ్ రిస్కీ జానర్ ని ట్రై చేస్తున్న ప్రభాస్ ఈ సినిమాతో అంచనాలను అందుకుంటే ఇక ఆ తర్వాత సినిమాలకు ఆకాశమే హద్దు అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here