ఒక భాషలో హిట్ అయిన సినిమాలు వేరే భాషలో హిట్ అవ్వాలన్న రూల్ ఏమి లేదు కానీ ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, అక్కడ భారీ హిట్ అయిందట… అంటే సినిమా లో ఎదో స్పెషల్ ఉండి ఉంటుంది అన్న క్యూరియాసిటీ తో ఇతర భాషల ఆడియన్స్ థియేటర్స్ కి తరలి వెళ్ళే అవకాశం ఉంటుంది, కానీ ఆ సినిమా ను సరిగ్గా ప్రమోట్ చేసుకోగలగాలి, అలా చేస్తేనే ఇది సాధ్యం అవుతుంది అని చెప్పొచ్చు.
రీసెంట్ గా కోలివుడ్ ఇండస్ట్రీ రికార్డులను క్లాష్ లోను తిరగరాసిన అజిత్ కుమార్ నటించిన సినిమా విశ్వాసం బాక్స్ ఆఫీస్ దగ్గర తమిళ్ వర్షన్ కి గాను 192 కోట్లకు పైగా గ్రాస్ ని అందుకుని దుమ్ము లేపగా తెలుగు లో ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సి ఉన్నా కానీ…
చాలా ఆలస్యంగా సినిమా ను 50 రోజుల తర్వాత ఇక్కడ రిలీజ్ చేశారు, ఎలాంటి ప్రమోషన్స్ లాంటివి లేకుండా ఎదో సినిమా రిలీజ్ చేస్తున్నాం అంటే చేస్తున్నాం అన్నట్లు గా రిలీజ్ చేయడం తో సినిమా ని పట్టించు కున్న వాళ్ళు లేకుండా పోయారు, దాంతో సినిమా కనీస ఓపెనింగ్స్ ని కూడా సొంతం చేసుకోలేదు.
బాక్స్ ఆఫీస్ దగ్గర తొలి 5 రోజుల్లో సినిమా కేవలం 92 లక్షల షేర్ ని మాత్రమె సొంతం చేసుకోగా గ్రాస్ మొత్తం మీద 1.5 కోట్ల దాకా ఉంటుందని అంచనా.. రీసెంట్ తమిళ్ డబ్ మూవీస్ విజయ్, విశాల్ మూవీస్ కి వీకెండ్ లోనే 3 నుండి 4 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ దక్కాయి.
కానీ విశ్వాసం సినిమా రిలీజ్ అయిన వారం రెండు వారాల్లో ఇక్కడ రిలీజ్ చేసి ఉంటే కచ్చితంగా బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. టార్గెట్ 3.2 కోట్ల రేంజ్ షేర్ ని అందుకోవడం అసాధ్యంగా కనిపిస్తుండటంతో సినిమా ఇక్కడ డిసాస్టర్ గా తేల్చేశారు.