బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మధ్య సినిమాల రివ్యూ లకు చాలా తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, అది మంచి పరిణామం అని చెప్పొచ్చు. చిన్న సినిమాలకు పాజిటివ్ రివ్యూ లు బాగా హెల్ప్ అవుతాయి కానీ పెద్ద సినిమాల విషయం లో పాజిటివ్ రివ్యూ లు నెగటివ్ రివ్యూలు ఏవి ఎలా ఉన్నా ఒకసారి చూడాలి అని ఫిక్స్ అయ్యే వాళ్ళు రివ్యూ లు పట్టించు కోకుండా సినిమాలను చూడటం రీసెంట్ గా కామన్ అయింది.
రీసెంట్ గా బాలీవుడ్ లో అక్షయ్ కుమార్, రితేష్ దేశ్ ముక్ మరియు బాబీ డియోల్ కలిసి నటించిన మల్టీ స్టారర్ మూవీ హౌస్ ఫుల్ 4 రిలీజ్ అయ్యింది, ఈ ఇయర్ ఇప్పటికే కేసరి, మిషన్ మంగల్ హిట్స్ తో జోష్ మీదున్న అక్షయ్ ఈ సినిమా తో హాట్రిక్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు.
కానీ రిలీజ్ అయిన మొదటి ఆటకే సినిమా కి డిసాస్టర్ రేటింగ్ అండ్ రివ్యూ లు ఇచ్చారు బాలీవుడ్ విశ్లేషకులు అందరు, అయినా కానీ పండగ హాలిడేస్ ని అడ్వాంటేజ్ గా తీసుకుని హౌస్ ఫుల్ 4 సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4 రోజుల్లో 87 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని అందుకోగా…
5 వ రోజు సాధించిన కలెక్షన్స్ తో సినిమా 100 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని డిసాస్టర్ రేటింగ్ ఇచ్చిన వాళ్లకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. సినిమా కూడా మరీ తీసి పారేసేలా లేకున్నా ఉన్నంతలో ఒకసారి చూసే విధంగా ఉందని చెప్పొచ్చు. కానీ 5 రోజుల్లో సాధించిన 100 కోట్లు సరిపోవు అనే చెప్పాలి.
సినిమా ఇండియా లో క్లీన్ హిట్ అవ్వాలి అంటే మినిమం 185 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని అందుకోవాల్సి ఉంటుందట. 5 రోజుల్లో 104 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ఉన్నాయని సమాచారం, అంటే మిగిలిన రన్ లో మరో 81 కోట్ల రేంజ్ కలెక్షన్స్ వస్తే కానీ సినిమా సేఫ్ అవ్వదు. మరి ఏం జరుగుతుందో చూడాలి మరి.