బాక్స్ ఆఫీస్ దగ్గర ఎట్టకేలకు సెకెండ్ పాండమిక్ తర్వాత ఒక మంచి రోజు లా ఆగస్టు 1 నిలిచింది. కొత్త సినిమాలు 2 ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు రాగా అందులో సత్యదేవ్ హీరోగా నటించిన తిమ్మరుసు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ పరంగా నిరాశ పరిచినా తర్వాత మౌత్ టాక్ తో జోరు చూపి బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడం మొదలు పెట్టి దుమ్ము లేపుతూ దూసుకుపోతుంది.
బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు మొత్తం మీద 25 లక్షల రేంజ్ షేర్ ని వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకున్న తిమ్మరుసు అందులో తెలుగు రాష్ట్రాలలో 16 లక్షల షేర్ ని సాధించింది. ఇక రెండో రోజు 26 లక్షల షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా…
36 లక్షల షేర్ ని సాధించింది. ఇక మూడో రోజు ఆదివారం అవ్వడం తో సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో రెండో రోజు కన్నా బెటర్ కలెక్షన్స్ ని సాధిస్తూ తర్వాత జోరు పెంచి రెండో రోజు కి డబుల్ కలెక్షన్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని 52 లక్షల షేర్ ని తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుంది.
దాంతో మొత్తం మీద ఇప్పుడు 3 రోజులు పూర్తీ అయ్యే సరికి రెండు తెలుగు రాష్ట్రాలలో తిమ్మరుసు సినిమా 94 లక్షల షేర్ ని దక్కించుకోగా అమెరికాలో 16 లక్షల షేర్ ని దక్కించుకుంది. ఇక మిగిలిన చోట్ల కలెక్షన్స్ తో 3 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 1.17 కోట్ల షేర్ ని ఈ సినిమా దక్కించుకుంది. మూడో రోజు మొత్తం మీద…
61 లక్షల షేర్ ని వరల్డ్ వైడ్ గా సాధించింది ఈ సినిమా.. సినిమాను టోటల్ గా 2.4 కోట్లకు అమ్మగా 2.6 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 3 రోజుల తర్వాత బ్రేక్ ఈవెన్ కి ఇంకా 1.43 కోట్ల షేర్ ని సాధించాల్సి ఉంటుంది… సినిమా రన్ ఇలానే కొనసాగితే సెకెండ్ వీకెండ్ టైం లో బ్రేక్ ఈవెన్ కి దగ్గరగా వెళ్ళే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.