బాక్స్ ఆఫీస్ దగ్గర సెకెండ్ పాండమిక్ తర్వాత ఆడియన్స్ ముందుకు వచ్చిన మొదటి సినిమా సత్యదేవ్ నటించిన తిమ్మరుసు బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి 10 రోజులను పూర్తీ చేసుకుంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత మంచి టాక్ నే సొంతం చేసుకున్న జనాలు థియేటర్స్ కి రావడానికి కొంచం టైం పట్టింది. దాంతో ఇనీషియల్ గా ఓపెనింగ్స్ ని మిస్ చేసుకుంది తిమ్మరుసు సినిమా. ఆ ఇంపాక్ట్ ఇప్పుడు బ్రేక్ ఈవెన్ పై…
పడిందని చెప్పాలి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారం కంప్లీట్ అయ్యే టైం కి తెలుగు రాష్ట్రాలలో 1.56 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా 1.87 కోట్ల షేర్ ని సొంతం చేసుకోగా సినిమా సెకెండ్ వీకెండ్ లో వరుస పెట్టి రిలీజ్ అయిన ఇతర సినిమాల వలన…
థియేటర్స్ ని చాలానే కోల్పోవాల్సి వచ్చింది. దాంతో ఉన్న థియేటర్స్ లోనే సినిమా లిమిటెడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వీకెండ్ మొత్తం మీద మరో 15 లక్షల రేంజ్ షేర్ ని తెలుగు రాష్ట్రాలలో అలాగే…
18 లక్షల వరకు షేర్ ని వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకుంది. దాంతో సినిమా మొత్తం మీద ఇప్పుడు 10 రోజులు పూర్తీ అయ్యే టైం కి తెలుగు రాష్ట్రాలలో 1.71 కోట్ల షేర్ ని అలాగే వరల్డ్ వైడ్ గా 2.03 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది. సినిమా ఓవరాల్ బిజినెస్ 2.4 కోట్లు కాగా 2.6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి సినిమా ఇంకా….
57 లక్షల షేర్ ని సొంతం చేసుకోవాల్సి ఉంది. సినిమా బిజినెస్ లో కొంచం అమౌంట్ ని మినిమమ్ గ్యారెంటీ కింద కొన్న బయ్యర్స్ కి వెనక్కి ఇచ్చారని అంటున్నారు. ఆ లెక్కలు ఇంకా తేలాల్సి ఉంది.. 2 వీక్స్ కంప్లీట్ అయ్యే టైం కి ఆ లెక్కలు తేలితే… బిజినెస్ నుండి ఆ అమౌంట్ ని తీసేసి మిగిలిన బిజినెస్ కి సినిమా ఎంత కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.