టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ నటించిన లేటెస్ట్ మూవీ తిమ్మరుసు డిజిటల్ రిలీజ్ కి మంచి మంచి ఆఫర్స్ వచ్చినా నో చెప్పి థియేటర్స్ లోనే రిలీజ్ అవ్వలాని డిసైడ్ అవ్వగా ఆడియన్స్ ముందుకు నేడు వరల్డ్ వైడ్ గా 300 వరకు థియేటర్స్ లో రిలీజ్ అయిన తిమ్మరుసు సినిమా ఎంతవరకు ఆకట్టుకుంది లాంటి విశేషాలను తెలుసుకుందాం పదండీ… సినిమా కథ పాయింట్ కి వస్తే… సిన్సియర్ లాయర్ అయిన హీరో 8 ఏళ్ల క్రితం…
మూత బడిన ఓ కేసుని తిరిగి రీ ఓపెన్ చేస్తాడు… అలా చేయడానికి రీజన్ ఏంటి, ఆ కేసు లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, ఆ కేసు వలన హీరో ఎలాంటి పరిస్థితులను ఎదురుకున్నాడు.. చివరికి తను అనుకున్నది ఎలా సాధించాడు అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
పెర్ఫార్మెన్స్ పరంగా సత్యదేవ్ తన సహజ నటనతో మెప్పించాడు… కొన్ని సీన్స్ లో హీరోయిజం ఎలివేట్ సీన్స్ లో కూడా ఫుల్ కాన్ఫిడెంట్స్ తో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ ప్రియాంక జవల్కర్ పర్వాలేదు అనిపించగా బ్రహ్మాజీ సటిల్డ్ కామెడీ మెప్పిస్తుంది. అజయ్ విలనిజం రొటీన్ గానే అనిపించింది. మిగిలిన నటీనటులు కూడా పర్వాలేదు అనిపించారు.
సంగీతం పర్వాలేదు అనిపించగా సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్ మెప్పిస్తుంది. కొన్ని సీన్స్ కి బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా ఆకట్టుకుంది. ఇక ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ టేక్ ఆఫ్ అవ్వడానికి కొంచం పట్టింది. కానీ టేక్ ఆఫ్ అయిన తర్వాత సినిమా బాగానే పుంజుకుని ఆకట్టుకునే స్క్రీన్ ప్లే తో మెప్పించింది. డైలాగ్స్ బాగా రాశారు…
ప్రొడక్షన్ వాల్యూస్ మెప్పించాయి. చిన్న సినిమా చూస్తున్నాం అన్న ఫీలింగ్ కలగకుండా ప్రొడక్షన్ వాల్యూస్ మెప్పించగా డైరెక్షన్ పరంగా శరన్ కొప్పిశెట్టి ఒరిజినల్ బీర్బల్ ట్రైయాలజీ ని బాగానే తెలుగు ఆడియన్స్ కి నచ్చేలా అడాప్ట్ చేశారు, కానీ టేక్ ఆఫ్ కి కొంచం ఎక్కువ తీసుకున్నట్లు అనిపించింది. అలాగే అక్కడక్కడ సీన్స్ కొంచం బోర్ ఫీల్ అయ్యేలా చేసినా…
ఓవరాల్ గా సినిమా ఒరిజినల్ మాదిరిగానే బాగా ఆకట్టుకుంది, క్రైం ఇన్వెస్టిగేషన్ నేపధ్యంలో సినిమా ఫస్టాఫ్ టేక్ ఆఫ్ అయిన తర్వాత మైండ్ గేమ్ తో ఎత్తుకు పైఎత్తు వేస్తూ ఒక్కో సీన్ బాగానే మెప్పించింది. ఫస్టాఫ్ విషయంలో మరింత శ్రద్ధ తీసుకుని ఉంటె సినిమా మరింత క్రిస్ప్ గా మెప్పించి ఉండేది…
అయినా కానీ ఓవరాల్ గా సత్యదేవ్ పెర్ఫార్మెన్స్, డీసెంట్ సెకెండ్ ఆఫ్, సాలిడ్ బ్యాగ్రౌండ్ స్కోర్ అండ్ మంచి క్లైమాక్స్ తో ఓవరాల్ గా ఓ మంచి సినిమా చూశాం రా అన్న ఫీలింగ్ తో ఆడియన్స్ థియేటర్స్ నుండి బయటికి రావడం ఖాయం. ఓవరాల్ గా సత్యదేవ్ ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమా తర్వాత తిమ్మరుసు సినిమాతో మరోసారి మెప్పించాడు..
ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్ కి వెళ్ళే ఆడియన్స్ ను చాలా వరకు ఆకట్టుకునే రేంజ్ లో తిమ్మరుసు సినిమా ఉంది. ఇక సెకెండ్ పాండమిక్ తర్వాత రిలీజ్ అయిన మొదటి సినిమా కాబట్టి సినిమాకి రేటింగ్ ఏమి ఇవ్వడం లేదు… మీరు ఫ్రీ టైం లో మాస్కులతో థియేటర్స్ కి వెళ్లి సినిమా ను చూడండి…