Home Uncategorized నారప్ప ఊచకోత ఇది… ఏ సినిమా నారప్ప రికార్డ్ దరిదాపుల్లో కూడా లేదుగా!!

నారప్ప ఊచకోత ఇది… ఏ సినిమా నారప్ప రికార్డ్ దరిదాపుల్లో కూడా లేదుగా!!

0

విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ నారప్ప బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి ఉంటే రచ్చ మరో విధంగా ఉండి ఉండేది కానీ సినిమా డిజిటల్ లో రిలీజ్ అవ్వడం తో సినిమా సాధించిన వ్యూస్ లెక్కలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. సినిమా ను 40 కోట్ల రేంజ్ రేటు కి కొన్న అమెజాన్ ప్రైమ్ కి అల్టిమేట్ ప్రాఫిట్స్ ని తెచ్చి పెట్టేలా దూసుకు పోతుంది నారప్ప సినిమా. రిలీజ్ అయిన మొదటి రోజు నుండే…

సాలిడ్ వ్యూవర్ షిప్ తో దూసుకు పోతున్న ఈ సినిమా రీసెంట్ గా ఫస్ట్ వీక్ పరంగా ఆల్ టైం రికార్డులను టాలీవుడ్ కి సొంతం చేసుకోగా లాస్ట్ ఇయర్ నుండి రిలీజ్ అయిన స్ట్రైట్ మూవీస్ అన్నింటిలో సెకెండ్ హైయెస్ట్ వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకున్న సినిమాగా నిలవగా…

ఇక ఈ ఇయర్ కి కూడా ఈ సినిమా సంచలన వ్యూవ్ రికార్డులను సొంతం చేసుకున్న సినిమాలను కూడా బ్రేక్ చేసింది అంటున్నారు. ఈ ఇయర్ లో అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన మూవీస్ లో బాలీవుడ్ మూవీస్ ఉన్నప్పటికీ పెద్దగా ఇంపాక్ట్ ని అయితే చూపలేదు.

ఉన్నంతలో విజయ్ నటించి మాస్టర్ రిలీజ్ అయిన రెండో వారమే డిజిటల్ లో రిలీజ్ అవ్వగా ఆల్ మోస్ట్ 25 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇక తర్వాత వచ్చిన సినిమాల్లో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా రిలీజ్ అయిన మూడో వారం లో డిజిటల్ లో రిలీజ్ అవ్వగా ఓవరాల్ గా వ్యూస్ 22 మిలియన్స్ దాకా సొంతం చేసుకుందట.

ఇక డైరెక్ట్ రిలీజ్ ను సొంతం చేసుకున్న నారప్ప ఇప్పటి వరకు అందిన రిపోర్ట్స్ ప్రకారం ఆల్ మోస్ట్ 32 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుందని అంటున్నారు. మొత్తం మీద ఈ ఇయర్ లో వచ్చిన అన్ని సినిమాల్లో హైయెస్ట్ వ్యూవర్ షిప్ తో నారప్ప సినిమా అమెజాన్ ప్రైమ్ టాపర్ గా ఉందని వేరే సినిమాలు ప్రస్తుతానికి పోటిలో కూడా లేక పోవడంతో లాంగ్ రన్ లో ఇంకా దూరం వెళ్ళొచ్చని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here