బాహుబలి తో పాన్ ఇండియా స్టార్ గా మారాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, హిందీ తో పాటు తమిళ్ అండ్ కేరళ లో కూడా ప్రభాస్ కి మంచి క్రేజ్ దక్కింది, బాహుబలి అక్కడ హైయెస్ట్ షేర్ ని సాధించి సంచలనం సృష్టించడం తో ప్రభాస్ న్యూ మూవీ సాహో పై రిలీజ్ కి ముందు నుండే భారీ అంచనాలు అక్కడ ఏర్పడ్డాయి. కానీ రిలీజ్ అయిన తర్వాత టోటల్ గా తలకిందలు అయిపోయే పరిస్థితి వచ్చింది.
తమిళ్ అండ్ కేరళ ఆడియన్స్ ఇతర భాషల సినిమాలను అతి తక్కువ సమయంలోనే ఆదరిస్తారు, లోకల్ మూవీస్ కే ఎక్కువ ప్రేయారిటీ ఇచ్చే వాళ్ళు సాహో సినిమా విషయం లో మాత్రం అసలు పట్టించుకొనే లేదు అనిపించేలా వ్యవహరించారు. తమిళ్ లో సినిమాను…
రికార్డ్ లెవల్ లో 550 థియేటర్స్ లో రిలీజ్ చేసినా ప్రయోజనం లేదు. టాక్ నెగటివ్ గానే ఉన్నా కనీస ఓపెనింగ్స్ కూడా అక్కడ రాలేదు. ఇక 4 రోజుల్లో మొత్తం మీద 4.15 కోట్ల షేర్ ని మాత్రమె రాబట్టింది. సినిమా బిజినెస్ ముందు 20 కోట్లు జరిగినా అది ఆగస్టు 15 రిలీజ్ అనుకున్నప్పుడు జరిగింది దాంతో తర్వాత బిజినెస్…
తగ్గించి 15 కోట్లు చేయగా సినిమా 4 రోజుల్లో 4.15 కోట్లు రికవరీ చేయడం తో లాంగ్ రన్ లో మరో కోటి కోటిన్నర వస్తే గొప్పే అంటున్నారు. అక్కడ సాలిడ్ దెబ్బ తగలగా తక్కువ మార్కెట్ ఉన్న కేరళలో కూడా 4 కోట్లు బిజినెస్ చేసిన సినిమా ఇప్పటికి 1.2 కోట్లకి పైగానే షేర్ ని అందుకుంది.
అక్కడ కూడా సినిమా ఫేట్ ఆల్ మోస్ట్ కన్ఫాం అయినట్లే అని చెప్పాలి. మరో పక్క హిందీ లో టాక్ కి మించి సెన్సేషనల్ కలెక్షన్స్ ని అందుకున్నా ఈ రెండు భాషల ఆడియన్స్ మాత్రం సినిమాకి భారీ గా హ్యాండ్ ఇచ్చారు. భాషా ప్రీతి అంటే ఎక్కువ మక్కువ చూపే వాళ్ళ సినిమాలు అక్కడ డిసాస్టర్ అయినా ఇక్కడ మంచి కలెక్షన్స్ వచ్చినవి చాలానే ఉన్నాయి. రీసెంట్ గా వచ్చిన టెంపర్ తమిళ్ రీమేక్ అయోగ్య తెలుగు డబ్బింగ్ నే తీసుకున్నా…
ఎలాంటి ప్రమోషన్ లాంటివి లేకున్నా 2 కోట్లకు పైగా షేర్ ని తెప్పించారు తెలుగు ఆడియన్స్, కానీ వాళ్ళు మన సినిమాల్లో ఏవో సెలెక్టివ్ గా మాత్రమే చూస్తూ వచ్చారు… ఓవరాల్ గా ఆ విషయం లో సాహో కి ఈ రెండు భాషల ఆడియన్స్ ఇచ్చిన హ్యాండ్ అస్సలు మరవలేమ్ అని చెప్పాలి.