Home న్యూస్ వీల్లండి ఆడియన్స్ అంటే…సలామ్ కొట్టాల్సిందే వీళ్ళకి!!

వీల్లండి ఆడియన్స్ అంటే…సలామ్ కొట్టాల్సిందే వీళ్ళకి!!

0

     బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ సెన్సేషన్ సాహో అదిరి పోయే రేంజ్ లో కలెక్షన్స్ ని సాధిస్తూ మొదటి 4 రోజుల్లో సగానికి పైగా బిజినెస్ ని రికవరీ చేసి దుమ్ము దుమారం చేసింది. కాగా సినిమా మొదటి రోజు మొదటి ఆటకి వచ్చిన టాక్ కి ఈ కలెక్షన్స్ కి ఏమాత్రం సంభందం లేదు అని చెప్పాలి. టాక్ కి అతీతంగా అల్టిమేట్ కలెక్షన్స్ ని సాధించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో…

నైజాం ఏరియాలో స్ట్రాంగ్ గా హోల్డ్ చేసి 4 రోజుల్లో 24 కోట్లకు పైగా షేర్ ని అందుకోగా మిగిలిన ఏరియాల్లో స్లో గానే పెర్ఫార్మ్ చేస్తూ వచ్చింది. కానీ సినిమా రిలీజ్ అయిన అన్ని భాషల్లో బాలీవుడ్ లో మాత్రం సినిమా కలెక్షన్స్ ఏమాత్రం స్లో డౌన్ అవ్వకుండా ఉన్నాయి.

అక్కడ ట్రేడ్ అనలిస్టులు, కొన్ని టాప్ వెబ్ సైట్స్ కూడా ప్రభాస్ క్రేజ్ ని జీర్ణించుకోలేక సినిమా కి మరీ ఘోరంగా 1.5 స్టార్ రేటింగ్ తోనే సరిపెట్టారు. దాంతో ఇక సినిమా కలెక్షన్స్ పరంగా అక్కడ భారీ నష్టాలు ఖాయమని అని అంతా అనుకున్నారు. కానీ బాలీవుడ్ ఆడియన్స్ మాత్రం అలా అనుకోలేదు.

సినిమా టాక్ ని పట్టించుకోకుండా 4 రోజుల్లో ఆల్ మోస్ట్ 94 కోట్ల లోపు నెట్ కలెక్షన్స్ ని అక్కడ సినిమా కి తెచ్చి పెట్టారు. దాంతో సినిమా ఇప్పుడు మొదటి వారం లోనే అక్కడ బ్రేక్ ఈవెన్ కానుంది. హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద సినిమాను 60 కోట్లకు పైగా అమ్మారు.

ఇప్పటికే సినిమా 55.5 కోట్లు రికవరీ చేసింది, మొదటి వారం లో బ్రేక్ ఈవెన్ కానున్న ఈ సినిమా అన్ని వర్షన్స్ లోకి బ్రేక్ ఈవెన్ కానున్న మొదటి వర్షన్ కానుంది. ఆ విషయం లో టాక్ ని పట్టించుకోకుండా ఎగబడి సినిమా ని చూసిన బాలీవుడ్ ఆడియన్స్ కి సలామ్ చెప్పి తీరాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here