టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత కారణాల వల్ల వెండితెరకు తిరిగి కంబ్యాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన తర్వాత ఒకటి తర్వాత ఒకటి వరుసగా సినిమాలను కమిట్ అయ్యాడు… అందులో 2 సినిమాలను ఏక కాలం లో మొదలు పెట్టి కెరీర్ లో ఎప్పుడూ లేనంత స్పీడ్ గా సినిమాల షూటింగ్ చేయడం మొదలు పెట్టగా అనుకోకుండా ఈ కరోనా ఎఫెక్ట్ రావడం తో అనుకున్న పనులు అన్నీ తారు మారు అయ్యాయి.
ఈ పాటికే రిలీజ్ అయ్యి పరుగు ముగించుకోవాల్సిన వకీల్ సాబ్ ఇయర్ ఎండ్ కి గాని సంక్రాంతి కి కానీ రాబోతుంది. ఇక మరో సినిమా పాన్ ఇండియా లెవల్ లో రూపొందుతున్నా ఇయర్ ఎండ్ కి రావాల్సింది కానీ వచ్చే ఇయర్ సమ్మర్ కి పోస్ట్ పోన్ అవ్వగా…
సినిమాను డైరెక్ట్ చేస్తున్న క్రిష్ సినిమా కి ఓవరాల్ గా ఒక వర్కింగ్ టైటిల్ 2 స్టాండ్ బై టైటిల్స్ ని అనుకున్నాడు. విరూపాక్ష, బందిపోటు మరియు గజదొంగ అనే మూడు డిఫెరెంట్ టైటిల్స్ ని ఈ సినిమా కోసం అనుకుంటున్నారు… మూడు అంత పవర్ ఫుల్ గా అయితే లేవు కానీ…
ఉన్నంతలో విరూపాక్ష డిఫెరెంట్ గా ఉండగా ఇది కన్ఫాం అవుతుంది అని భావిస్తున్న టైం లో కొత్త టైటిల్ రేసులోకి వచ్చింది. మొదటి మూడు టైటిల్స్ కన్నా కూడా పవర్ ఫుల్ గా ఉన్న ఈ టైటిల్ రవితేజ నటించిన సినిమా టైటిల్ అవ్వడంతో ఎంతవరకు సెలెక్ట్ చేస్తారు అన్నది డౌట్ గా మారింది ఇప్పుడు…
సినిమా కి “వీర” అనే టైటిల్ ని అనుకుంటున్నారట. టైటిల్ చాలా పవర్ ఫుల్ గా రవితేజ 2011 ఇయర్ లో నటించిన వీర సినిమా టైటిల్ నే మళ్ళీ వాడుతారా అన్న డౌట్ ఉంది.. అదే సమయం లో 10 ఏళ్ల తర్వాత పాత సినిమా టైటిల్స్ ని వాడుతూ ఉంటారు. మరి ఈ టైటిల్ నే వాడతారా లేక వేరే కొత్త టైటిల్ ని ఆలోచిస్తారా అన్న వివరాలు తెలియాల్సి ఉంది. ఎలాగూ రిలీజ్ కి ఏడాది మినిమం టైం ఉన్న నేపధ్యంలో ఈ టైటిల్ వాడినా పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు అని చెప్పొచ్చు.