తమిళ ప్రజలు అమ్మ అంటూ ప్రేమగా పిలుచుకునే జయలలిత గారి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా తలైవి… కంగనా రనౌత్ జయలలిత రోల్ లో నటించగా అరవింద్ స్వామి MGR గా నటించారు… వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన ఈ బయోపిక్ చాలా కాలంగా రిలీజ్ అవ్వాల్సి ఉండగా ఎట్టకేలకు భారీ ఎత్తున పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయింది, మరి సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ..
కథ పాయింట్ కి వస్తే… తల్లి కోరిక మేరకి చిన్న ఏజ్ లోనే నటిగా ఎదగాలని ఇండస్ట్రీలో అడుగు పెట్టిన జయలలిత తక్కువ టైం లోనే స్టార్ హీరోయిన్ అవుతుంది, తర్వాత MGR తో ప్రేమలో పడగా వీరి ప్రేమ ఎటు వెళ్ళింది…. రాజకీయాల్లో ఎంటర్ అయిన తర్వాత జయలలిత ఎదురుకున్న పరిస్థితులు ఏంటి…
వాటిని అధిగమిస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతూ తమిళ ప్రజల చేత అమ్మ అంటూ జేజేలు కొట్టించుకున్న జయలలిత లైఫ్ స్టొరీ బాగానే ఆకట్టుకుంది, జయలలితగా కంగనా అద్బుతంగా నటించి మెప్పించాగా MGR గా అరవింద్ స్వామి కూడా అద్బుతంగా నటించారు. ఇద్దరి పెయిర్ ఆకట్టుకోగా ఇద్దరూ డిఫెరెంట్ గెటప్స్ తో ఆకట్టుకున్నారు.
బయోపిక్ కాబట్టి జరిగింది చూపాలి కానీ జయలలిత గారు తెలుగు లో ఎన్నో సినిమాలు తీశారు కానీ సినిమాలో అవేవి చూపెట్టలేదు, అలాగే కంగనాకి వేసిన మేకప్ కొన్ని చోట్ల ఏమాత్రం సెట్ అవ్వలేదు, తనకి రెండు డిఫెరెంట్ డబ్బింగ్ లు చెప్పించారు కానీ అవి కూడా అంత ఎఫెక్టివ్ గా లేవు. ఇవి మేజర్ మైనస్ పాయింట్స్ కానీ ఇవి తప్పితే సినిమాలో ఆకట్టుకునే ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి.
లైఫ్ స్టొరీ అయినా పడుతూ లేస్తూ సాగిన జయలలిత గారి జీవితం చాలా మందికి ఆదర్శం అని చెప్పాలి, సినిమాలో అవి చాలా బాగా చూపెట్టారు కానీ ఎక్కువగా తమిళ్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని చేయడంతో తెలుగు లో ఎలా కనెక్ట్ చేసుకుంటారో చూడాలి. ఓవరాల్ గా సినిమా బయోపిక్స్ లో డీసెంట్ గా తీసిన సినిమాల్లో ఒకటిగా నిలుస్తుంది.. సినిమా కి మా రేటింగ్ 3 స్టార్స్…