Home న్యూస్ టైర్ 2 హీరోల్లో బిగ్గెస్ట్ రికార్డ్ కొట్టిన నాగచైతన్య ఫ్యాన్స్!

టైర్ 2 హీరోల్లో బిగ్గెస్ట్ రికార్డ్ కొట్టిన నాగచైతన్య ఫ్యాన్స్!

0

     ప్రస్తుతం అన్ని చోట్లా లాక్ డౌన్ కంటిన్యు అవుతున్న నేపధ్యం లో టాలీవుడ్ ఫ్యాన్స్ సినిమాలు లేక ఖాళీ అయిపోయారు, సోషల్ మీడియా లో తమ హీరోల సినిమాల యానివర్సరీ ట్రెండ్స్, అప్పుడప్పుడు ఫ్యాన్ వార్స్, ఇతర ట్రెండ్స్ తో బిజీ అయిపోయారు. ఇక రీసెంట్ గా యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ఫ్యాన్స్ సోషల్ మీడియా లో టైర్ 2 హీరోల సినిమాల పరంగా ఓ కొత్త రికార్డ్ ట్రెండ్ ని నమోదు చేసి సంచలనం సృష్టించారు.

టైర్ 2 హీరోలు నటించిన సినిమాల యానివర్సరీ ట్రెండ్ లో బిగ్గెస్ట్ ట్రెండ్ ని నమోదు చేశారు. నాగ చైతన్య కెరీర్ లో నంబర్ 1 హిట్ గా నిలిచిన సినిమా మజిలీ… లాస్ట్ ఇయర్ సమ్మర్ ఫస్ట్ హిట్ గా నిలిచిన ఈ సినిమా తో నాగచైతన్య…

కెరీర్ లో మొదటి సారి 40 కోట్ల మార్క్ ని అందుకున్నాడు. ఈ సినిమా రిలీజ్ అయ్యి 1 ఇయర్ పూర్తీ అయిన సందర్భంగా సోషల్ మీడియా లో ఫ్యాన్స్ ట్రెండ్ ని మొదలు పెట్టారు. మొత్తం మీద 24 గంటల్లో 184.2K ట్వీట్స్ తో పాత రికార్డులను బ్రేక్ చేశారు.

ఇది వరకు నాచురల్ స్టార్ నాని కెరీర్ బెస్ట్ మూవీ MCA రిలీజ్ అయ్యి 2 ఏళ్ళు అవుతున్న సందర్భంగా నాని ఫ్యాన్స్ లాస్ట్ ఇయర్ ట్రెండ్ చేయగా 154K కి పైగా ట్వీట్స్ ని నమోదు చేసి టైర్ 2 హీరోలలో బిగ్గెస్ట్ ట్రెండ్ ని నమోదు చేసి సంచలనం సృష్టించారు.

ఇప్పుడు ఆ రికార్డ్ ను బ్రేక్ చేసిన నాగ చైతన్య ఫ్యాన్స్ 30 వేలకు పైగా ట్వీట్స్ ఎక్కువ పోల్ చేసి నాని సినిమా రికార్డ్ ను బ్రేక్ చేసి టాప్ 1 లో నిలిచారు. ఇక నాని ఫ్యాన్స్ త్వరలోనే జెర్సీ వచ్చి 1 ఇయర్ అవ్వబోతుంది, అప్పుడు ఈ రికార్డ్ ను బ్రేక్ చేసి తిరిగి టాప్ కి చేరుకుంటాం అన్న కసితో ఉన్నారు. మరి రికార్డ్ కొడతారో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here