Home న్యూస్ టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోల కెరీర్ బిగ్గెస్ట్ హిట్ మూవీస్ లిస్టు ఇదే!!

టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోల కెరీర్ బిగ్గెస్ట్ హిట్ మూవీస్ లిస్టు ఇదే!!

0

సినిమాల పరంగా పెద్ద చిన్న అన్న తేడా లేకుండా ఎప్పుడు ఏ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపుతుందో ఎవ్వరం చెప్పలేము…. కొన్ని సినిమాలు చిన్నవి అయినా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాలను నమోదు చేస్తూ ఉంటాయి, కొన్ని సినిమాలు పెద్దవి అయినా అప్పుడప్పుడు అంచనాలను తప్పుతూ ఉంటాయి. ప్రస్తుతానికి సీనియర్ హీరోలు, టాప్ హీరోలు కాకుండా టైర్ 2 స్టార్ హీరోల విషయానికి వస్తే.. రీసెంట్ టైం లో కొందరు హీరోలు బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన కలెక్షన్స్ ని తమ సినిమాలతో సాధించారు.

యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ గీత గోవిందం సినిమా తో టైర్ 2 హీరోల్లో ఎవ్వరికీ అందనంత ఎత్తులో 70 కోట్లకి పైగా షేర్ ని అందుకుని బిగ్గెస్ట్ బెంచ్ మార్క్ ని సెట్ చేశాడు. ఈ అద్బుతం జరిగి 4 ఏళ్ళు అయిపోయినా కానీ రికార్డ్ ఇప్పటికీ అలానే కొనసాగుతూ ఉండటం విశేషం…

విజయ్ దేవరకొండ కన్నా ముందే నితిన్ అ..ఆ సినిమా తో ఆల్ మోస్ట్ 50 కోట్లకు చేరువ అయ్యి దుమ్ము లేపాడు. ఇక 2019 ఇయర్ లో నాగ చైతన్య మజిలీ తో అలాగే రామ్ ఇస్మార్ట్ శంకర్ తో కెరీర్ బెస్ట్ అండ్ 40 కోట్ల క్లబ్ లో చేరగా ఇయర్ ఎండ్ లో సాయి ధరం తేజ్ కూడా ప్రతీ రోజూ పండగే తో కెరీర్ బెస్ట్ కొట్టాడు.

మొత్తం మీద టైర్ 2 హీరోల కెరీర్ బెస్ట్ టాప్ మూవీస్ ని ఒకసారి గమనిస్తే
1. విజయ్ దేవరకొండ(గీతగోవిందం): 70.5 కోట్లు
2. నితిన్(అ.ఆ):49 కోట్లు++
3. వరుణ్ తేజ్(ఫిదా): 48.5 కోట్లు
4. రామ్(ఇస్మార్ట్ శంకర్): 40.56 కోట్లు
5. నాగ చైతన్య( మజిలి): 40.23 కోట్లు
6. నాని( MCA ): 40.1 కోట్లు
7. సాయి ధరం తేజ్( ప్రతీరోజూ పండగే ): 34.06 కోట్లు
8. శర్వానంద్(శతమానం భవతి): 34 కోట్లు 
9. అడివి శేష్(మేజర్): 33.35 కోట్లు
10. రానా( ఘాజీ అటాక్): 27.10 కోట్లు
11. అఖిల్ అక్కినేని( మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ): 24.14 కోట్లు

ప్రస్తుతానికి ఇవి టైర్ 2 హీరోల సోలో టాప్ మూవీస్… 2022 లో లాస్ట్ ఇయర్ నుండి పెండింగ్ లో ఉన్న సినిమాలతో పాటు కొత్త సినిమాలు కూడా వరుస పెట్టి రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండటం తో వీళ్ళ కెరీర్ బెస్ట్ మూవీస్ కచ్చితంగా మారే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మరి అవి ఏ సినిమాలు అవుతాయో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here