బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ ను 2010 టైం నుండి ఓ 10 ఏళ్ల పాటు ఏలిన సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) ఒకప్పటిలా అయితే సాలిడ్ హిట్స్ ని సొంతం చేసుకోలేక పోతున్నాడు. చేసిన సినిమాలు అన్నీ కూడా అంచనాలను అందుకోలేక పోతున్నాయి. ఇలాంటి టైంలో స్పై యూనివర్స్ లో భాగంగా…
అన్ని సినిమాల కన్నా ముందు ఏక్ థా టైగర్ సినిమాతో సంచలనం సృష్టించి తర్వాత టైగర్ జిందా హై తో భారీ బ్లాక్ బస్టర్ కొట్టి…తర్వాత వచ్చిన వార్, పఠాన్ లాంటి సినిమాలకు బేస్ ని క్రియేట్ చేసిన సల్మాన్ నటించిన టైగర్ సిరీస్ లో వస్తున్న మూడో పార్ట్ అయిన టైగర్ 3(TIGER3 Movie) ఆడియన్స్ ముందుకు…
ఇప్పుడు దీపావళి కానుకగా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది, పఠాన్(Pathaan) సినిమా తర్వాత పరిస్థితులతో ఈ సినిమా ఉండబోతుంది అంటూ చెబుతూ ఉండగా సినిమా మీద హైప్ ఉంది కానీ అది పఠాన్ మూవీతో పోల్చినా అలాగే టైగర్ జిందా హైతో పోల్చినా కూడా చాలా తక్కువగానే ఉందని చెప్పాలి.
షారుఖ్ నటించిన రీసెంట్ మూవీస్ పఠాన్, జవాన్ సినిమాలు మొదటి రోజు బాలీవుడ్ రికార్డులను తిరగరాసే ఓపెనింగ్స్ ను అందుకోగా… ప్రజెంట్ టైగర్3 బుకింగ్స్ ట్రెండ్ ను చూస్తూ ఉంటే మొదటి రోజు 36-40 కోట్ల మధ్యలో నెట్ కలెక్షన్స్ ని అందుకోవచ్చు అంటూ అంచనా వేస్తున్నారు…
పఠాన్ 55 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ ని, జవాన్ 65.50 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకోగా స్పై యూనివర్స్ లో భాగం అయిన వార్ మూవీ 51.60 కోట్ల కలెక్షన్స్ ని అందుకుంది. వాటితో పోల్చితే ఇప్పుడు టైగర్3 ట్రెండ్ చాలా స్లోగా ఉండటంతో బజ్ పెంచడానికి మేకర్స్ ట్రై చేస్తున్నారు. అది వర్కౌట్ అయ్యి సినిమా మొదటి రోజు ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి ఇక…