మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) నటించిన లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara Rao) సినిమా ఆడియన్స్ ముందుకు వరల్డ్ వైడ్ గా ఆల్ మోస్ట్ 1800 థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకుంది. సినిమా మీద మంచి అంచనాలు ఉండగా ఎంతవరకు సినిమా ఆ అంచనాలను అందుకుందో లేదో తెలుసు కుందాం పదండీ…. ముందుగా సినిమా స్టోరీ పాయింట్ విషయానికి వస్తే…
ఊర్లో తను ప్రేమించిన అమ్మాయితో జీవించే హీరో కొన్ని కారణాల వలన దొంగగా మారతాడు…మామూలు దొంగ మోస్ట్ వాంటెడ్ దొంగగా ఎలా మారాడు, దాని వెనక ఉన్న రీజన్ ఏంటి…ఆ తర్వాత కథ ఏమయింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే… రవితేజ కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ అనిపించే విధంగా ఈ సినిమాలో నటించి మెప్పించాడు… యాక్షన్ సీన్స్ అదరగొట్టాడు. హీరోయిజం సీన్స్ బాగా ఎలివేట్ అయ్యాయి….
రవితేజ ఇంట్రోనే ఓ రేంజ్ లో మెప్పించడం విశేషం అని చెప్పాలి. హీరోయిన్స్ పర్వాలేదు అనిపించగా మిగిలిన రోల్స్ ఓకే అనిపించారు…సంగీతం బాగుండగా కొన్ని సీన్స్ కి బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా సెట్ అయ్యింది… ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్ట్ 20-25 నిమిషాల దాకా బాగా ఉంటుంది, ఆ తర్వాత కథ పడుతూ లేస్తూ సాగగా ఇంటర్వెల్ ఎపిసోడ్ బాగా మెప్పించిన తర్వాత సెకెండ్ ఆఫ్ ఎపిసోడ్ కొంచం ఎక్కువగా డ్రాగ్ చేసినట్లు అనిపించింది.
దానికి తోడూ సినిమా లెంత్ కూడా చాలా ఎక్కువ అయిన ఫీలింగ్ కలిగింది, సినిమాటోగ్రఫీ ఎక్స్ లెంట్ గా ఉండగా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి, కానీ కొన్ని సీన్స్ కి డబ్బింగ్ అసలు ఎందుకో సింక్ అవ్వనట్లు అనిపించింది, ఇక డైరెక్షన్ విషయానికి వస్తే డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ బాగుండగా దాన్ని చెప్పే విధానంలో చాలా టర్న్స్ తీసుకోవడం…
అవి చూస్తున్న ఆడియన్స్ కి కొంచం కన్ఫ్యూజన్ ని అలాగే బోర్ ని ఫీల్ అయ్యేలా చేయడం తో ఓవరాల్ గా సినిమా పార్టు పార్టులుగా బాగున్నా కూడా ఓవరాల్ గా చెప్పాలి అంటే మాత్రం ఫుల్ సాటిస్ చేయలేదు, కానీ రవితేజ నటన, హీరోయిజం సీన్స్ అలాగే కొన్ని రాబరీ సీన్స్ ను బాగా రాసుకున్నాడు… ఓవరాల్ గా సినిమాలో రవితేజ బిగ్ ప్లస్ పాయింట్ కాగా, బ్యాగ్రౌండ్ స్కోర్…
డీసెంట్ ఫస్టాఫ్ అలాగే యాక్షన్ సీన్స్ మేజర్ ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి. లెంత్ అలాగే కథని మరీ డ్రాగ్ చేయడం, అక్కడక్కడా ట్రాక్ తప్పినట్లు అనిపించడం లాంటివి డ్రా బ్యాక్స్… ఓవరాల్ గా రవితేజని కొత్తగా చూడాలి అనుకునే ఆడియన్స్ అలాగే ఫ్యాన్స్ కి సినిమా బాగానే నచ్చే అవకాశం ఉండగా రెగ్యులర్ మూవీ లవర్స్ కొంచం ఓపిక పట్టి చూస్తె…
సినిమా ఉన్నంతలో బాగానే ఆకట్టుకునే అవకాశం ఉంది, ట్రైలర్ బాగా ఇంప్రెస్ చేసిందని కొంచం ఓవర్ అంచనాలతో వెళితే కొంచం నిరాశగా అనిపించవచ్చు కానీ చాలా వరకు సినిమా ఆడియన్స్ ను సాటిస్ ఫై చేసేలా ఎండ్ అవుతుంది. మొత్తం మీద సినిమా కి మేం ఇస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్…
Anna eppudu kotha cinema release ayina morning e collections post chesthav eroju inka official collections post asalu nee channel e change ayindi kada inthaku mundu la ledu
Anna official collections post chey Anna eppudu inka ledu