Home న్యూస్ రామ్ చరణ్ లియోలో ఉన్నాడా…లేదా…అసలు మ్యాటర్ ఇదే!!

రామ్ చరణ్ లియోలో ఉన్నాడా…లేదా…అసలు మ్యాటర్ ఇదే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లేటెస్ట్ మూవీ లియో(LEO Movie) మీద భారీ అంచనాలు ఉండేవి, LCU లో సినిమా ఒక భాగం కాబోతుందా లేదా అన్న డౌట్స్ అలాగే సినిమాలో స్పెషల్ క్యామియోలలో ఎవరెవరు ఉండబోతున్నారు అన్న డౌట్స్ ఇలా అనేక ఆసక్తిల నడుమ సినిమా రిలీజ్ అవ్వగా…

స్పెషల్ క్యామియోల విషయంలో టాలీవుడ్ లో భారీ హైప్ ఇచ్చిన న్యూస్ ఇప్పుడు తీవ్రంగా నిరాశ పరిచింది…ఈ సినిమా లో స్పెషల్ గెస్ట్ రోల్ లో టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) రోల్ ఉంటుంది అంటూ హైప్ ని పెంచారు. సినిమా స్టార్ కాస్ట్ ను ఇంటర్నేషనల్ వెబ్ సైట్స్ కి అప్ డేట్ చేస్తూ అందులో రామ్ చరణ్ పేరు కూడా…

చేర్చడంతో అందరిలోనూ రామ్ చరణ్ స్పెషల్ రోల్ ఇందులో ఉండబోతుందని, LCU లో తర్వాత రామ్ చరణ్ కూడా ఉండబోతున్నట్లు వార్తలు జోరుగా శిఖారు చేయడంతో సినిమా మీద హైప్ మరింతగా పెరిగి పోయింది ఇక్కడ… తీరా సినిమా చూసిన తర్వాత హైప్ ని మొత్తం నీరు గార్చేలా…

ఎలాంటి స్పెషల్ క్యామియోలు లేవు, ఆ వార్తలు అన్ని గాలివార్తలు అవ్వగా భారీ హైప్ తో వెళ్ళిన ఆడియన్స్ ఒకింత నిరాశ చెందారు అనే చెప్పాలి. క్లైమాక్స్ లో స్పెషల్ క్యామియోలకు అవకాశం ఉన్నప్పటికీ కూడా డైరెక్టర్ అలాంటి అవకాశాలను వాడుకోలేదు అనే చెప్పాలి.

ఓవరాల్ గా తెలుగు రామ్ చరణ్ స్పెషల్ రోల్ ఇందులో ఉంటుంది అని ఆశతో వెళ్ళిన మెగా ఫ్యాన్స్ కి నిరాశ మిగలగా సినిమా ఓవరాల్ గా కూడా మరీ హైప్ ను అందుకోలేక పోయినా యాక్షన్ మూవీ లవర్స్ ను బాగానే ఆకట్టుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here