బిచ్చగాడు సిరీస్ తో తెలుగులో మంచి కలెక్షన్స్ ని అందుకున్న విజయ్ ఆంటోని(Vijay Antony) నటించిన రీసెంట్ మూవీస్ పెద్దగా అంచనాలను అందుకోవడంలో విఫలం అవుతూ వస్తూ ఉండగా రీసెంట్ గా విజయ్ ఆంటోని నటించిన కొత్త సినిమా తుఫాన్(Toofan Movie Telugu Review) రీసెంట్ గా రిలీజ్ అవ్వగా అంచనాలను సినిమా అందుకుందా లేదా అంటే…
ఏమాత్రం అంచనాలను అయితే అందుకోలేదు అనే చెప్పాలి…కథ పాయింట్ కి వస్తే సీక్రెట్ ఏజెంట్ అయిన హీరో ఒక మిషన్ లో తను ప్రేమించిన అమ్మాయి చనిపోవడంతో తన సీనియర్ అయిన శరత్ కుమార్ ఒక ఊరిలో ఉండమంటాడు…ఆ ఊరిలో జనాలను వడ్డీ వ్యాపారంతో…
దోచుకుంటున్న విలన్ గురించి హీరోకి తెలుస్తుంది…ఆ తర్వాత హీరో ఏం చేశాడు అన్నది మిగిలిన కథ….మొత్తం మీద కథ పాయింట్ కొంచం పర్వాలేదు అనిపించినా కూడా స్క్రీన్ ప్లే పరంగా మాత్రం చాలా స్లో నరేషన్ తో సాగే సినిమా ఫస్టాఫ్ వరకు ఎలాగోలా పర్వాలేదు అనిపించినా…
సెకెండ్ ఆఫ్ కి వచ్చే సరికి మాత్రం సహనానికి పరీక్ష పెడుతుంది…విజయ్ ఆంటోని పర్వాలేదు అనిపించేలా పెర్ఫార్మ్ చేయగా మిగిలిన యాక్టర్స్ ఓకే అనిపించేలా నటించగా సంగీతం ఓకే అనిపించగా ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే పరంగా చాలా వరకు డ్రాగ్ అయ్యి బోర్ అయ్యేలా చేస్తుంది.
డైరెక్టర్ ఎంచుకున్న ఓవరాల్ పాయింట్ పర్వాలేదు అనిపించినా కూడా తెరకెక్కించే క్రమంలో మాత్రం కథని చాలా డ్రాగ్ చేయడంతో చూస్తున్న ఆడియన్స్ కొన్ని సీన్స్ మినహా చాలా వరకు సినిమా బోర్ అండ్ డ్రాగ్ అయ్యేలా చేసి ఏమాత్రం ఇంప్రెస్ చేయలేక పోయింది….
సెకెండ్ ఆఫ్ ని ఇంకా ట్రిమ్ చేయాల్సిన అవసరం ఉండగా సెకెండ్ ఆఫ్ ని ఓవరాల్ గా ఇంకా బెటర్ గా డీల్ చేసి ఉంటే ఎంతో కొంత పర్వాలేదు అనిపించేది…కానీ ఓవరాల్ గా తుఫాన్ మూవీ చూడాలి అంటే మాత్రం చాలా చాలా ఓపిక అవసరం అని చెప్పాలి. మొత్తం మీద సినిమాకి మా రేటింగ్ 2 స్టార్స్…