Home న్యూస్ 24 గంటల్లో టాలీవుడ్ టీసర్లలో హైయెస్ట్ లైక్స్ సాధించిన టాప్ 10 టీసర్స్!!

24 గంటల్లో టాలీవుడ్ టీసర్లలో హైయెస్ట్ లైక్స్ సాధించిన టాప్ 10 టీసర్స్!!

0

    సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ సరిలేరు నీకెవ్వరు సినిమా అఫీషియల్ టీసర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి యునానిమస్ పాజిటివ్ బజ్ ని సొంతం చేసుకుంది, దాంతో పాటే ఫ్యాన్స్ కి అల్టిమేట్ కిక్ కూడా ఇచ్చింది, రికార్డుల పరంగా కూడా సంచలన రికార్డులను నమోదు చేసి యూట్యూబ్ లో 24 గంటలు పూర్తీ అయ్యే సరికి సరికొత్త రికార్డులను నమోదు చేస్తూ ఏకంగా 18 మిలియన్ రియల్ టైం వ్యూస్ ను…

అలాగే 14.64 మిలియన్ అప్ డేటెడ్ వ్యూస్ తో ఆల్ టైం రికార్డ్ కొట్టగా టీసర్ రిలీజ్ అయిన మొదటి కొన్ని గంటల్లో లైక్స్ పరంగా ఈ టీసర్ మరిన్ని భీభత్సాలు నమోదు చేస్తుంది అని అంతా భావించారు. ఫాస్టెస్ట్ 50 వేల లైక్స్ ని, లక్ష లైక్స్ ని మరియు 2 లక్షల లైక్స్ రికార్డులు కొట్టిన తర్వాత…

స్లో డౌన్ అయిన టీసర్ కి యూట్యూబ్ కూడా కొన్ని వేల లైక్స్ ని తొలగించింది, దానికి క్లియర్ కారణాలు తెలియరాలేదు కానీ ఆ ఇంపాక్ట్ టీసర్ పై పడటం తో ఓవరాల్ గా 24 గంటల్లో సరికొత్త లైక్స్ రికార్డులు నమోదు చేయడంలో విఫలం అయిన టీసర్ ఆల్ టైం టాప్ 3 ప్లేసును సొంతం చేసుకుంది.

ఒకసారి ఆల్ టైం టాప్ 10 హైయెస్ట్ లైక్స్ ని 24 గంటల్లో అందుకున్న టీసర్లను ఒకసారి పరిశీలిస్తే
?#SaahoTeaser- 455K
?#Agnyaathavaasi-412K
?#SarileruNeekevvaruTeaser – 386K Likes
?#SyeRaa Teaser2- 352K
?#AravindhaSametha-292K
?#SyeRaaNarasimhaReddy-290K
?#Maharshi—287K
?#BharatAneNenu-282K
?#Rangasthalam-250K
?#VinayaVidheyaRama(2018)- 207K
ఇవీ మొత్తం మీద టాప్ 10 లో నిలిచిన టీసర్లు…

సరిలేరు నీకెవ్వరు ఫెయిల్ అవ్వడంతో సాహో రికార్డ్ బ్రేకింగ్ లైక్స్ అలాగే కొనసాగుతున్నాయి, ఇక కొన్ని రోజుల్లో అల వైకుంఠపురంలో టీసర్ రిలీజ్ కానుండగా… తర్వాత ఒకటి తర్వాత ఒకటి క్రేజీ సినిమాల టీసర్లు రానున్నాయి. మరి వాటిలో ఏ సినిమా సాహో లైక్స్ రికార్డ్ ను బ్రేక్ చేస్తుంది అని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here