నట సింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీనుల కాంబినేషన్ లో సింహా లెజెండ్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత వస్తున్న సినిమా అఖండ. మరి కొన్ని గంటల్లో వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ ను సొంతం చేసుకోబోతున్న ఈ సినిమా పై అంచనాలు అయితే ఓ రేంజ్ లో ఉన్నాయని చెప్పాలి. ఆ అంచనాలను తగ్గట్లే సెకెండ్ వేవ్ తర్వాత టాలీవుడ్ నుండి హైయెస్ట్ బిజినెస్ ను…
సొంతం చేసుకున్న సినిమా గా సంచలన రికార్డ్ ను నమోదు చేసిన ఈ సినిమా ఆంధ్రలో టికెట్ రేట్ల విషయంలో జరిగిన కొత్త చర్చల వలన బిజినెస్ కొంచం తగ్గాల్సి వచ్చిన విషయం తెలిసిందే. అయినా కానీ అల్టిమేట్ బిజినెస్ ను ఓవరాల్ గా అందుకుని 53 కోట్లతో…
బాలయ్య కెరీర్ లో సెకెండ్ బిగ్గెస్ట్ బిజినెస్ చేసిన సినిమాగా నిలిచింది. ఒకసారి బాలయ్య రీసెంట్ మూవీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ లను గమనిస్తే… రూలర్ సినిమా 23.75 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకోగా దానికన్నా ముందు వచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా బాలయ్య కెరీర్ లో నంబర్ 1 బిజినెస్ చేసిన సినిమా అయ్యింది.
ఆ సినిమా 70.60 కోట్ల బిజినెస్ ను అందుకోగా ఆ సినిమా కన్నా ముందు జై సింహా సినిమా 26 కోట్ల బిజినెస్ ను దక్కించుకుంది, ఆ సినిమా కన్నా ముందు పైసా వసూల్ సినిమా 32.5 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకోగా ఆ సినిమా కన్నా ముందు గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా 46 కోట్ల రేంజ్ బిజినెస్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపింది.
వీటిలో ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా ఎన్టీఆర్ కథానాయకుడు నష్టాలే బిజినెస్ గా మారి ఆ బిజినెస్ లో 10% కూడా రికవరీ చేయలేక పోయింది. ఓవరాల్ గా ఆ ఇంపాక్ట్ ఏమి ఇప్పుడు అఖండ కి లేకుండా ఫుల్ హైప్ ఉన్న బజ్ తో వస్తున్న అఖండ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి మాస్ రచ్చ చేస్తుంది అన్నది ఇప్పుడు అందరూ ఆశగా ఎదురు చూస్తున్న విషయం అన్ని చెప్పాలి.