కరోనా వలన లాస్ట్ ఇయర్ నుండి చాలా సినిమాలు డిజిటల్ రిలీజ్ కు మొగ్గు చూపుతూ వస్తున్నాయి, అందులో కొన్ని క్రేజీ మూవీస్ ఉన్నాయి కొన్ని చిన్న సినిమాలు ఉన్నాయి, క్రేజ్ ను బట్టి రేట్లు సొంతం అవుతూ ఉండగా క్రేజ్ ని బట్టి వ్యూవర్ షిప్ కూడా సొంతం అవుతూ వస్తుంది. ఇక ఇండియా లో ఇప్పటి వరకు డిజిటల్ లో డైరెక్ట్ గా రిలీజ్ అయిన సినిమాల్లో కొన్నింటికీ రికార్డ్ లెవల్ వ్యూస్ దక్కాయి.
వాటిలో 5 ప్లేస్ లో మోహన్ లాల్ నటించిన దృశ్యం 2 సినిమా మొదటి రోజు 1.15 మిలియన్ యూనిక్ వ్యూస్ దక్కినట్లు సమాచారం. అమెజాన్ ప్రైమ్ లో మలయాళం సినిమాల పరంగా ఇది ఆల్ టైం ఎపిక్ రికార్డ్ గా నిలిచింది. ఇక 4 వ ప్లేస్ కి వస్తే…
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన చివరి సినిమా దిల్ బేచారా డిజిటల్ రిలీజ్ లలో రిలీజ్ అయినప్పుడు ఒక సంచలనం సృష్టించింది, ఆ సినిమా రిలీజ్ టైం లో ఫ్రీ గా అందరికీ అందుబాటులోకి తెచ్చారు, కానీ పెయిడ్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళు సుమారు 2.35 మిలియన్స్ వరకు సినిమాను ఫస్ట్ డే చూశారు.
ఇక మూడో ప్లేస్ లో సూర్య నటించిన సూరరై పోట్రు సినిమా సౌత్ భాషలన్నింటిలోనూ డబ్ అవ్వగా మొదటి రోజు రికార్డ్ లెవల్ వ్యూస్ ను సొంతం చేసుకుంది, ఈ సినిమా వ్యూస్ పరంగా ఫేక్ లెక్కలు బయటికి రాగా యూనిక్ వ్యూస్ పరంగా 2.6 మిలియన్ యూనిక్ వ్యూస్ ని 24 గంటల్లో అన్ని భాషల్లో సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది.
అమెజాన్ ప్రైమ్ లో పాట రికార్డులను తిరగరాసింది సూర్య సినిమా… ఇక రెండో ప్లేస్ లో అక్షయ్ కుమార్ నటించిన లక్ష్మీ సినిమా భారీ హైప్ నడుమ దీపావళి టైం లో వచ్చిన లక్ష్మీ సినిమా అద్బుతమైన వ్యూస్ తో ఆల్ టైం రికార్డులు నమోదు చేసింది. ఈ సినిమా వ్యూస్ పరంగా కూడా ఫేక్ లెక్కలు అప్పుడు బయట చెప్పారు కానీ…
మొత్తం మీద ఈ సినిమా కి యూనిక్ వ్యూస్ మొదటి 24 గంటలకు గాను 3.73 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుందట. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో దిల్ బేచారా పెయిడ్ సబ్ స్క్రిప్షన్ వ్యూస్ రికార్డ్ కన్నా సాలిడ్ రికార్డ్ ను లక్ష్మీ సినిమా సొంతం చేసుకుని సరికొత్త రికార్డ్ ను సృష్టించింది.
ఇక మొదటి ప్లేస్ లో సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ రాధే మాత్రం డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కాకుండా అందులో పే పెర్ వ్యూ పద్దతిలో రిలీజ్ ను సొంతం చేసుకుంది, ఒక్కో టికెట్ కి 249 రేటు పెట్టినా కానీ మొదటి రోజు రికార్డ్ లెవల్ లో వ్యూస్ ఈ సినిమా కి దక్కడం విశేషం..
ఏకంగా 4.2 మిలియన్స్ వరకు వ్యూస్ ని పే పెర్ వ్యూ పద్దతి లోనే సొంతం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు, కానీ ఈ సినిమా ఆ రికార్డ్ ను సొంతం చేసుకుని ఫస్ట్ డే ఇండియా లో హైయెస్ట్ వ్యూయర్ షిప్ ను దక్కించుకున్న సినిమా గా నిలిచి సంచలనం సృష్టించింది.
ఇక్కడ మరో విశేషం ఏంటంటే సినిమా రిలీజ్ అయిన ప్లాట్ ఫాం జీ ప్లెక్స్ అనే కొత్త యాప్ లో రిలీజ్ అయినా సల్మాన్ ఖాన్ సూపర్ స్టార్ డం తో ఇలాంటి రికార్డ్ ను నమోదు చేసింది, ఇక ఈ రూట్ లోనే అప్ కమింగ్ బిగ్ మూవీస్ కూడా అడుగులు వేస్తే త్వరలో ఇలాంటి రికార్డులు మరిన్ని ఇండియన్ సినిమాల పరంగా నమోదు అయ్యే అవకాశం ఎంతైనా ఉంది.