Home టోటల్ కలెక్షన్స్ ఫలక్ నూమ దాస్ కలెక్షన్స్: బడ్జెట్ 4 కోట్లు…అమ్మింది 6 కోట్లు…టోటల్ గా వచ్చింది ఇది!!

ఫలక్ నూమ దాస్ కలెక్షన్స్: బడ్జెట్ 4 కోట్లు…అమ్మింది 6 కోట్లు…టోటల్ గా వచ్చింది ఇది!!

0

  సమ్మర్ ఎండ్ సమయం లో రిలీజ్ అయిన ఫలక్ నూమ దాస్ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనిపించే టాక్ ని సొంతం చేసుకోగా కలెక్షన్స్ పరంగా నైజాం వరకు మంచి వసూళ్ళనే సాధించినా మిగిలిన చోట్ల అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోలేదు. అయినా కానీ ఓవరాల్ గా బిజినెస్ ని దాటేసే కలెక్షన్స్ ని సాధించి ఎలా గోలా బ్రేక్ ఈవెన్ మార్క్ ని కంప్లీట్ చేసుకుంది..

రెండు తెలుగు రాష్ట్రాలలో ఫైనల్ రన్ లో ఈ సినిమా 6.16 కోట్ల షేర్ ని వసూల్ చేసింది, అందులో నైజాం లోనే 3.8 కోట్లకు పైగా షేర్ ని సాధించింది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా టోటల్ రన్ లో 6.77 కోట్ల షేర్ ని వసూల్ చేసి పరుగును ముగించింది ఈ సినిమా…టోటల్ గ్రాస్ 11 కోట్ల మార్క్ ని అందుకుంది.

సినిమాను మొత్తం మీద 4 కోట్ల లోపు బడ్జెట్ తో రూపొందించగా సినిమాను టోటల్ గా 6 కోట్లకు అమ్మారు. కాగా 7 కోట్ల లోపు టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా బిజినెస్ ని క్రాస్ చేసి ఓవరాల్ గా మైనర్ ప్రాఫిట్స్ తో హిట్ అనిపించుకుంది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here