Home న్యూస్ ట్రాన్స్ మూవీ రివ్యూ…ఫస్టాఫ్ కుమ్మింది…సెకెండ్ ఆఫ్..???

ట్రాన్స్ మూవీ రివ్యూ…ఫస్టాఫ్ కుమ్మింది…సెకెండ్ ఆఫ్..???

0

ఆహా యాప్ లో ఈ మధ్య వారం వారం ఎదో ఒక డబ్ మూవీ తెలుగు లో డబ్ అవ్వడం డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ గా ఆడియన్స్ ముందుకు వస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం. లేటెస్ట్ గా మలయాళ టాలెంటెడ్ యాక్టర్ ఫహాద్ ఫాజిల్ హీరోగా తన భార్య నజ్రియా నజిం ముఖ్య పాత్రలో గౌతమ్ మీనన్ నెగటివ్ షేడ్స్ లో ప్రేమం నిర్మాత అన్వర్ రషీద్ డైరెక్షన్ లో తెరకెక్కిన…

ట్రాన్స్ మూవీ ఈ ఇయర్ మొదట్లో భారీ అంచనాల నడుమ అక్కడ రిలీజ్ అవ్వగా సినిమా కి ఓపెనింగ్స్ దక్కినా అంచనాలను అందుకోలేదు. ఇక తెలుగు లో డబ్ అయ్యి రిలీజ్ అయిన ఈ సినిమా ఇక్కడ ఆడియన్స్ ని ఆకట్టుకుందా లేదా అన్న విశేషాలు తెలుసుకుందాం పదండీ..

కథ విషయానికి వస్తే… చిన్నప్పుడే కళ్ళముందు తల్లి అప్పుల భాద వలన ఉరి వేసుకోవడం చూసిన కుర్రాడు, మతి స్థిమితంగా లేని తమ్ముడి తో కలిసి జీవిస్తూ ఉంటాడు. పెద్దయ్యాక మోటివేషనల్ స్పీచులు ఇచ్చే వృత్తిని ఎంచుకునే హీరో తన తమ్ముడి రోగాన్ని నయం చేద్దామని డాక్టర్ దగ్గరకు తీసుకు వెళుతుంటే అన్న పైనే అటాక్ చేస్తాడు.

అయినా తనని ఎలాగైనా బాగు చేసుకోవాలని, లైఫ్ లో సెటిల్ అవ్వాలని కోరుకునే హీరో, ఒకరోజు తన అన్నకి ఏమాత్రం హెల్ప్ చేయలేకపోతున్న తమ్ముడు కూడా ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంటాడు. ఇక అన్న కూడా మెల్లిమెల్లిగా డిప్రెషన్ కి వెళుతున్న టైం లో…

తనకి ఒక జాబ్ ఆఫర్ వస్తుంది, అది తన లైఫ్ నే మార్చేస్తుంది… ఆ జాబే ఫాస్టర్ గా మత పరమైన స్తోత్రములు చెప్పే పని… ఆ కొత్త లైఫ్ తన జీవితాన్ని ఎలా మార్చింది, హీరోయిన్ లైఫ్ స్టొరీ ఏంటి, చివరకు ఎం జరిగింది అన్న వివరాలు అన్ని సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అద్బుతమైన నటుడిగా పేరున్న ఫహాద్ ఫాజిల్ పేరుకు తగ్గట్లే మరోసారి అద్బుత నటనతో మెప్పిస్తాడు, ప్రతీ సీన్ లో కూడా తన నటనే హైలెట్ అవుతుంది, ఇక హీరోయిన్ నజ్రియా చాల గ్యాప్ తర్వాత నటించిన సినిమా కాగా తన పాత్ర జస్ట్ ఓకే అనిపించేలా ఉంటుంది.

గౌతమ్ మీనన్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రతో మెప్పించగా మిగిలిన పాత్రలు మనకు పెద్దగా పరిచయం లేకున్నా ఉన్నంతలో బాగానే నటించి మెప్పించారు. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే చాలా స్లోగా ఉంటుంది, ఫస్టాఫ్ వరకు బాగున్నా సెకెండ్ ఆఫ్ బోర్ కొట్టేస్తుంది, సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ మాత్రం బాగున్నాయి.

డైరెక్షన్ పరంగా ఓ డిఫెరెంట్ కాన్సెప్ట్ మూవీ ని ఎంచుకుని ఫస్టాఫ్ వరకు అంచనాలను అందుకునేలా డైరెక్ట్ చేసిన డైరెక్టర్ సెకెండ్ ఆఫ్ ని నీరసంగా మార్చేశాడు, సీన్స్ రిపీటెడ్ గా అనిపించగా హీరోయిన్ రోల్ ఎదో పెట్టాలి అని పెట్టారు అనిపిస్తుంది, సెకెండ్ ఆఫ్ ని ఫస్టాఫ్ లా డీల్ చేసి ఉంటె సినిమా మరో లెవల్ లో ఉండేది.

మొత్తం మీద సినిమా డిప్రెషన్, ఫాస్టర్స్ మతం పేరుతో చేసే వ్యాపారం, వాటినే గుడ్డిగా నమ్మి మోసపోయే వాళ్ళ పరిస్థితులు బాగానే చూపించినా ఆ డోస్ మరీ ఎక్కువ అయిన ఫీలింగ్ సెకెండ్ ఆఫ్ లో కలుగుతుంది, ఇక ఎండింగ్ అయినా బాగుంటుంది అనుకుంటే అది కూడా ఎదో ముగించాలి అని ముగించినట్లు ఉంటుంది.

రిలీజియస్ క్రైమ్స్ మీద మంచి మేసేజ్ ఇచ్చినా ముందే చెప్పినట్లు ఆడియన్స్ కి డోస్ మరీ ఎక్కువ అయ్యేలా చేశారు… డిఫెరెంట్ కాన్సెప్ట్ మూవీస్ ఇష్టపడే వారు సినిమా ఫస్టాఫ్ చూసి ఇంప్రెస్ అవుతారు, కమర్షియల్ మూవీస్ ఇష్టపడే వారికి సినిమా కొద్ది సేపటికే బోర్ కొడుతుంది, ఓవరాల్ గా ఇది కొందరికి మాత్రమే సెట్ అయ్యే సినిమా… సినిమా కి మా రేటింగ్ 2.5 స్టార్స్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here