Home గాసిప్స్ నిజమా —- కాదా…టోటల్ ఇండస్ట్రీ షాక్ లో ఉంది!!

నిజమా —- కాదా…టోటల్ ఇండస్ట్రీ షాక్ లో ఉంది!!

0

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బాక్స్ ఆఫీస్ దగ్గర అల వైకుంఠ పురం లో ఇండస్ట్రీ హిట్ కొట్టిన జోష్ లో ఉన్న విషయం తెలిసిందే, ఇక ఈ సినిమా తర్వాత రంగస్థలం తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన సుకుమార్ తో తన అప్ కమింగ్ మూవీ ని చేస్తున్నాడు అల్లు అర్జున్. రీసెంట్ గా అల్లు అర్జున్ పుట్టిన రోజు కానుకగా.. పుష్ప అఫీషియల్ ఫస్ట్ లుక్ ని రివీల్ చేయగా….

రెస్పాన్స్ అదిరి పోయే రేంజ్ లో వచ్చింది కానీ కొన్ని రోజులకే యూనిట్ నుండి ఒక షాకింగ్ న్యూస్ ఒకటి రిలీజ్ అయింది, ఆ న్యూస్ ప్రకారం సినిమా లో కీలక పాత్ర చేయబోతున్న కోలివుడ్ హీరో విజయ్ సేతుపతి ఈ సినిమా నుండి తప్పుకున్నారు అని..

కారణాలు ఏంటి అనేవి క్రిస్టల్ క్లియర్ గా చెప్పకున్నా కానీ స్వతహాగా ఒకే సమయం లో ఎక్కువ సినిమాలు చేసే అలవాటు ఉన్న విజయ్ సేతుపతి కమిట్ అయిన సినిమాలు చాలా ఎక్కువగా ఉండటం, లాక్ డౌన్ పూర్తీ అవ్వడానికి మరింత ఎక్కువ సమయం పట్టేలా ఉండటం తో… ఇతర సినిమాలకు డేట్స్ ఇష్యూ అవుతుంది అని…

ఈ సినిమా నుండి విజయ్ సేతుపతి తప్పుకున్నాడు అనే వార్తా ఎక్కువ ప్రచారం లో ఉన్నా… ఇప్పుడు అది నిజం కాదన్నా వార్తా కూడా ప్రచారం లో ఉంది. అసలు విషయం సినిమా పాన్ ఇండియా అవ్వడం తో ముందు అనుకున్న రెమ్యూనరేషన్ కాకుండా టోటల్ గా 10 కోట్ల రేటు సేతుపతి అడగడంతో…

జరిగిన చర్చల వలన ఈ సినిమా నుండి తప్పుకున్నాడని అంటున్నారు. యూనిట్ ఇతర యాక్టర్స్ కోసం ట్రై చేస్తున్నా సుకుమార్ బన్నీల చాయిస్ మాత్రం సేతుపతి మాత్రమే అని అంటున్నారు… మరి ఇది ఎంతవరకు నిజం,.. ఫైనల్ గా సేతుపతి ఉంటాడో కొత్త యాక్టర్ ని తీసుకుంటారా అన్న విషయాలు త్వరలో తెలిసే అవకాశం ఉందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here