సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ తో సినిమాలు అన్నీ రిలీజ్ లు ఆపుకుని కూర్చోగా కొన్ని సినిమాలు డైరెక్ట్ రిలీజ్ ల వైపు అడుగులు వేస్తూ ఉండగా థియేటర్స్ ఎలాగూ తెరచుకున్నాయి కాబట్టి ఆడియన్స్ ముందుకు సినిమాలను తీసుకు రావాలని ఎదురు చూస్తున్న సినిమాలలో నాచురల్ స్టార్ నాని నటించిన టక్ జగదీష్ సినిమా అలాగే యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన లవ్ స్టొరీ సినిమాలు ఆశగా ఎదురు చూస్తున్నాయి.
నాని టక్ జగదీష్ సినిమా అయితే ఎలాగైనా ఈ నెల 30 న ఆడియన్స్ ముందుకు రావాలని సన్నాహాలు కూడా మొదలు పెట్టిన తరుణంలో ఆంద్ర ప్రదేశ్ లో థియేటర్స్ పరిస్థితి దెబ్బ కొట్టింది, వకీల్ సాబ్ సినిమా టైం లో 150-200 వరకు ఉన్న టికెట్ రేట్లని అమాంతం తగ్గించి కేవలం 10 నుండి…
50 వరకు కొన్ని AC థియేటర్స్ లో మాత్రం 100 వరకు టికెట్ రేట్లు ఉండేలా నిర్ణయం తీసుకోవడంతో చాలా థియేటర్స్ మూసేయాల్సిన పరిస్థితి రాగా ఇంతలో సెకెండ్ వేవ్ కూడా రావాడంతో ఇప్పుడు తిరిగి థియేటర్స్ ని రీ ఓపెన్ చేయడంతో ఆ రేట్లు నార్మల్ చేస్తారు అనుకున్నా కానీ రీసెంట్ గా మూడు జిల్లాలలో…
టికెట్ రేట్లు డిసైడ్ చేయగా ఆ రేట్లు 50 లోపే ఉండటంతో ఇప్పుడు ఈస్ట్ గోదావరి జిల్లాలో థియేటర్స్ అన్నింటిని కూడా మూసేస్తున్నామని, ఈ రేట్లు నార్మల్ అయ్యాకే తెరుస్తామని చెప్పారు. దాంతో ఈ తక్కువ రేట్లతో అయినా ఆడియన్స్ ముందుకు వస్తామనుకున్న టక్ జగదీష్ కానీ తర్వాత రిలీజ్ అవ్వాల్సిన లవ్ స్టొరీ సినిమాలు కూడా ఇప్పుడు వెనక్కి తగ్గి…
కంప్లీట్ గా పరిస్థితులు నార్మల్ అయ్యాకే ఆడియన్స్ ముందుకు రావాలని ఇప్పుడు ఫిక్స్ అయ్యారు. ఇక ఇండస్ట్రీ పెద్దలు థియేటర్స్ లో AC వాటిలో బాల్కనీ 100, రిసర్వ్ 70 ఇలా టికెట్ రేట్లని పెట్టాలని వినతి పత్రాలు ఇస్తుంది, మరి ఆంధ్ర ప్రభుత్వం దీనిపై సానుకూలంగా స్పందిస్తే అప్పుడు సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుందని సమాచారం. ఈ దెబ్బ మీద దెబ్బతో సినిమాల రిలీజ్ లు అన్నీ ఎటూ తోచని పరిస్థితిలో ఉన్నాయి ఇప్పుడు..