Home TRP రేటింగ్ నితిన్ చెక్ TRP…డిసాస్టర్ మూవీ…కానీ TRP కుమ్ముంది!

నితిన్ చెక్ TRP…డిసాస్టర్ మూవీ…కానీ TRP కుమ్ముంది!

0

యూత్ స్టార్ నితిన్ నటించిన ఎక్స్ పెరి మెంటల్ మూవీ చెక్ ఈ ఇయర్ పాండమిక్ తర్వాత ఆడియన్స్ ముందుకు థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాల్లో ముందు నిలిచింది, డీసెంట్ టాక్ ని రిలీజ్ అయిన తర్వాత సొంతం చేసుకుంది ఈ సినిమా, అప్పటికే భీష్మ సినిమా తో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ కొట్టిన నితిన్ నుండి డీసెంట్ టాక్ వచ్చిన చెక్ కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర…

మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది అనుకున్నా కానీ ఏమాత్రం ఇంపాక్ట్ ని క్రియేట్ చేయలేక పోయిన చెక్ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ నుండే అండర్ పెర్ఫార్మ్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచింది. 16.5 కోట్ల టార్గెట్ కి 9.35 కోట్ల షేర్ ని మాత్రమే సాధించి…

భారీ నష్టాలను సొంతం చేసుకుంది, తర్వాత సినిమా శాటిలైట్ రైట్స్ ని జెమినీ టీవీ వాళ్ళు డీసెంట్ రేటు కే కొన్నప్పటికీ కూడా టెలికాస్ట్ ని ఆలస్యం చేశారు. ఫిబ్రవరిలో సినిమా రిలీజ్ అయితే సినిమా టెలికాస్ట్ ను జులై లో రీసెంట్ గా చేశారు ఛానెల్ వాళ్ళు.

ఇక సినిమా కి మొదటి సారి టెలికాస్ట్ అయిన తర్వాత TRP పై పెద్దగా అంచనాలు ఏవి లేకపోవడం తో సినిమా తక్కువ రేటింగ్ నే సాధిస్తుంది అనుకున్నా కానీ 8.53 రేటింగ్ ను ఈ సినిమా ఫస్ట్ టైం టెలికాస్ట్ లో సొంతం చేసుకుని బాగానే హోల్డ్ చేసి దుమ్ము లేపింది అని చెప్పాలి. ఎక్స్ పెరిమెంటల్ మూవీ అందునా బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచిన….

సినిమానే అయినా కానీ సినిమా టెలివిజన్ లో టెలికాస్ట్ టైం లో సాలిడ్ రేటింగ్ తో దుమ్ము లేపింది, కొన్ని పెద్ద సినిమాలకు వచ్చే రేంజ్ రేటింగ్ ను ఫ్లాఫ్ మూవీతో సొంతం చేసుకోవడం విశేషం…సినిమా నితిన్ న్యూ మూవీ రంగ్ దే 7.22 కన్నా బెటర్ రేటింగ్ ను సొంతం చేసుకుని సత్తా చాటుకుంది, ఛానెల్ కి మరో టెలికాస్ట్ నుండి సినిమా లాభాలను సొంతం అయ్యేలా చేయడం ఖాయం.

Check 2 Days Total World Wide Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here