బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టి చాలా టైం అవుతున్న వాళ్ళలో బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Sreenivas) ఒకరు, అప్పుడెప్పుడో 2019 టైంలో రాక్షసుడు మూవీతో కెరీర్ లో తొలి హిట్ కొట్టిన బెల్లంకొండ శ్రీనివాస్ ఆ తర్వాత మళ్ళీ వరుస ఫ్లాఫ్స్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు భీమ్లా నాయక్(Bheemla Nayak) మూవీ డైరెక్టర్ సాగర్ కే చంద్ర డైరెక్షన్ లో….
టైసన్ నాయుడు(Tyson Naidu Movie) సినిమా తో త్వరలో సందడి చేయబోతున్నాడు. సినిమాలో బాక్సర్ గా నటించబోతున్న బెల్లంకొండ, ఇయర్ స్టార్టింగ్ లో గ్లిమ్స్ తో ఆకట్టుకోగా తర్వాత మళ్ళీ సినిమా మీద ఎలాంటి అప్ డేట్ లేకుండా పోయింది. ఆల్ మోస్ట్ 5 నెలల తర్వాత ఇప్పుడు మళ్ళీ సినిమా నుండి కొత్త అప్ డేట్ వచ్చింది…
కాగా సినిమా 2 వారాల పాటు రాజస్థాన్ లో భారీ యాక్షన్ సీన్ ను షూటింగ్ చేస్తున్నారట…కాగా ఆల్ మోస్ట్ 2.5 కోట్ల రేంజ్ ఖర్చుతో ఈ యాక్షన్ సీన్ ను భారీ ఎత్తున తెరకెక్కిస్తూన్మరట, మాస్ మూమెంట్స్ ఓ రేంజ్ లో ఉండబోతున్న ఈ సీన్ సినిమా కి మేజర్ హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు.
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు సెకెండ్ ఆఫ్ లో వచ్చే అవకాశం ఉందని అంటున్నారు, సాగర్ కే చంద్ర డీసెంట్ మూవీ తీసే అవకాశం ఎంతైనా ఉండటంతో ఈ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్ మంచి కంబ్యాక్ ను ఎక్స్ పెర్ట్ చేస్తున్నాడు. మరి ఈ సినిమాతో ఎలాంటి కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాడో చూడాలి ఇక…