నాచురల్ స్టార్ నాని కెరీర్ లో ప్రతిష్టాత్మక 25 వ సినిమాగా తెరకెక్కిన సినిమా వి ది మూవీ, సుధీర్ బాబు కీలక పాత్ర పోషించిన ఈ సినిమాలో నివేద థామస్ మరియు అదితి రావ్ హైదరిలు హీరోయిన్స్ గా నటించిన సినిమా కరోనా ఎఫెక్ట్ వలన ఆగి ఆగి డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ని నేడు సొంతం చేసుకుంది. మరి సినిమా ఎలా ఉంది అంచనాలను అందుకుందా లేదా తెలుసుకుందాం పదండీ…
కథ విషయానికి వస్తే…పాత బస్తీ గొడవల్లో ఓ ముప్పై మందిని వీరోచింతంగా రక్షించిన సుధీర్ బాబుకి ప్రభుత్వం నుండి అవార్డ్ రావడం తో పార్టీ ఇవ్వగా ఆ పార్టికి వచ్చిన ఓ పోలిస్ చనిపోతాడు, తనని చంపిన విలన్ నాని సుధీర్ తో మరింత మందిని…
చంపబోతున్నాని సవాల్ చేస్తాడు, దాంతో వి ది మూవీ టేక్ ఆఫ్ అవుతుంది, అసలు నాని ఎందుకు విలన్ అయ్యాడు, ఎందుకు చంపుతున్నాడు, తన ఫ్లాష్ బ్యాక్ ఏంటి, సుధీర్ బాబు నాని ని ఎలా ఆపాడు లాంటివి సినిమా చూసి తెలుసు కోవాల్సిందే.
కథ వింటుంటే కొంచం ఆసక్తి కరంగా అనిపిస్తుంది కదా… కానీ సినిమా చూడటం మొదలు పెట్టిన తర్వాత సైకో థ్రిల్లర్ లాంటి సినిమానే అయినా ఈజీగా తర్వాత సీన్ ని అంచనా వెయ గలుగుతాం. హీరో నాని మరీ సైకో లా మనుషులను చంపడని కచ్చితంగా ఎదో ఫ్లాష్ బ్యాక్ స్టోరి ఉంటుందని ఊహిస్తాం.
అలాగే ఉంటుంది కానీ ఆ ఫ్లాష్ బ్యాక్ మరీ నీరసంగా ఉండటం చూసి బాదపడతాం… ఇలా వి మూవీ అడుగడుగునా అంచనాలను తప్పుతూ నీరసంగా మారింది. ఇతర ఇండస్ట్రీ ల నుండి అనేక రీసెంట్ సైకో థ్రిల్లర్ మనం చూసే ఉన్నాం…. ఫోరెన్సిక్, లాస్ట్ ఇయర్ రాక్షసుడు, మలయాళం లో వచ్చిన…
అంజాం పత్తిర లాంటి ఎక్స్ లెంట్ సైకో థ్రిల్లర్ చూసిన వాళ్ళు ఈ సినిమా చూసి అసలు ఇది సైకో థ్రిల్లర్ మూవీ నే కాదని చెప్పేస్తారు, కానీ గుర్తు చేయడానికి సినిమా లో అతడో సైకో, సైకో అంటూ చెప్పిస్తారు…
ఇలా అడుగడుగునా అంచనాలు తప్పిన సినిమా కి నాని తన తరుపు నుండి ఎంత చేయాలో అంతా చేశాడు, లుక్స్ లో చేంజ్, వాయిస్ లో చేంజ్, కొంచం యాటిట్యూడ్, ఇలా తన తరుపు నుండి సినిమా ని కాపాడటానికి ఎం చేయాలో అది చేసినప్పటికీ కథలో దమ్ము లేకపోవడం తో ఏమి చేయలేకపోయాడు.
ఇక సుధీర్ బాబు ఫస్ట్ ఫైట్ సీన్ లో దుమ్ము లేపగా తర్వాత సటిల్డ్ యాక్టింగ్ తో మెప్పించాడు, ఇద్దరు హీరోయిన్స్ కూడా నామ మాత్రానికే సినిమా లో ఉండగా మిగిలిన నటీనటులు ఉన్నంతలో మెప్పించారు. ఇక అమిత్ త్రివేది అందించిన పాటలు…
పర్వాలేదు అనిపించగా… తమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం అసలు అంచనాలను అందుకోలేదు, పైపెచ్చు రీసెంట్ కొన్ని థ్రిల్లర్స్ లో విన్న సౌండ్స్ ఇందులో అదే విధంగా వినిపించడం గమనార్హం. ఇక ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఏమాత్రం బాలేదనే చెప్పాలి. కానీ ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం అదిరిపోయాయి అని చెప్పాలి.
దిల్ రాజు సినిమా కోసం బాగా ఖర్చు చేశారు. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే మోహన కృష్ణ ఇంద్రగంటి ఇది వరకు తీసిన జెంటిల్ మాన్ సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఓ రేంజ్ లో అలరించడం తో ఈ సినిమా ఇక నాని 25 వ సినిమా అవ్వడం తో మరో లెవల్ లో ఉంటుంది అనుకుంటే…
మోహన కృష్ణ ఇంద్రగంటి సింపుల్ రివేంజ్ సినిమాను సైకో సైకో అని అనిపించే ప్రయత్నం చేసి అంచనాలను అందుకోలేక పోయాడు. అక్కడక్కడా కొన్ని సీన్స్ తప్పితే సినిమా డైరెక్ట్ రిలీజ్ కి ముందు వచ్చిన హైప్ ని ఏమాత్రం అందుకోలేక పోయింది.
రీసెంట్ గా బెస్ట్ సైకో థ్రిల్లర్స్ తో ఈ సినిమాను పోల్చితే వి మూవీ చాలా నీరసంగా అనిపించింది. తన కెరీర్ లో 25 వ సినిమాతో భారీ ప్రయోగం చేయడం విషయం లో నాని మెచ్చుకోవాల్సిందే కానీ కథ లో దమ్ము లేక పోవడం, డైరెక్షన్ వీక్ గా ఉండటం వలన వి మూవీ నిరాశ పరిచింది… సినిమా కి ఫైనల్ రేటింగ్ 2.5 స్టార్స్….